Movie News

పెళ్లి తర్వాత కాజల్‌ను చూస్తామా?

హీరోయిన్లకు పెళ్లయిందంటే వాళ్ల కెరీర్ ముందుకు సాగడం కష్టమే. ఒకవేళ సినిమాలు చేసినా.. ముందులా లీడ్ రోల్స్ చేయడం, గ్లామరస్‌గా కనిపించడం.. పెద్ద చిత్రాల్లో అవకాశాలు దక్కించుకోవడం కష్టమే. ఐతే గతంతో పోలిస్తే ఈ విషయంలో ఈ మధ్య మార్పు కనిపిస్తోంది. పెళ్లయిన తారలు కూడా పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్‌లో కొనసాగుతున్నారు.

సమంత, శ్రియ, రాధికా ఆప్టే, కరీనా కపూర్, శకుంతలా దేవి లాంటి హీరోయిన్లు ఇందుకు ఉదాహరణ. ఐతే పై జాబితాలోని వాళ్లందరూ మంచి పెర్ఫామర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటారు. వీళ్లతో పోలిస్తే కాజల్ అగర్వాల్ భిన్నమైన హీరోయిన్‌గా చెప్పొచ్చు. ఆమె కెరీర్ అంతా గ్లామర్ రోల్స్‌తోనే సాగిపోయింది. కొన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసినా.. అవి పెద్దగా గుర్తింపు తేలేదు. కానీ ఆమెకు అవకాశాలకు మాత్రం లోటు లేదు.

తన పెళ్లి గురించి జరుగుతున్న ఊహాగానాలకు తెర దించుతూ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్నట్లు కాజల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఆమె పెళ్లి జరగబోతోంది. మరి పెళ్లి చేసుకున్నాక కాజల్ సినీ కెరీర్ సంగతేంటి అని అందరిలోనూ ప్రశ్న ఉదయిస్తోంది. కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు భారీ సినిమాలున్నాయి. ఒకటి.. ఆచార్య కాగా, ఇంకోటి ఇండియన్-2. పెళ్లయిన వెంటనే కాజల్ ‘ఆచార్య’ కోసం పని చేయాల్సి ఉంది. ‘ఇండియన్-2’ కోసం కూడా ఇంకా చాలా కాల్ షీట్లే ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వచ్చే ఆరు నెలల్లో ఆమె వ్యక్తిగత జీవితానికి పెద్దగా సమయం కేటాయించే అవకాశం లేనట్లే.

ఇది కాక కాజల్ కోసం రెండు మూడు సినిమాలు ఎదురు చూస్తున్నాయి. కానీ వాటిని క్యాన్సిల్ చేస్తుందేమో చూడాలి. బడా వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా వరకు సినిమాలకు దూరం అయిన వాళ్లే. అసలే పెళ్లవుతోంది. పైగా కాజల్ లాంటి గ్లామ్ హీరోయిన్లకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ రావడం కష్టమే. ఆమె అక్క, వదిన, తల్లి తరహా పాత్రలు చేయడమూ సందేహమే. కాబట్టి ఎంతో కాలం ఈ చందమామను సినిమాల్లో చూసే అవకాశం లేనట్లే.

This post was last modified on October 6, 2020 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

1 hour ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

2 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

2 hours ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

3 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

3 hours ago