విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాను మొదలుపెట్టే సమయానికి రష్మిక మందన్నా.. తన తొలి చిత్ర కథానాయకుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది. కానీ గీత గోవిందం పూర్తయ్యే సమయానికి ఆమె అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పట్నుంచి విజయ్‌తోనే ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్-రష్మిక కెమిస్ట్రీ చూసినా.. బయట వీళ్లిద్దరూ తరచుగా కలవడాన్ని గమనించినా వీరి మధ్య ప్రేమ ఉన్నట్లే భావిస్తారు ఎవరైనా.
ఈ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇస్తూ అభిమానులను టీజ్ చేస్తూనే ఉంటారు. విజయ్, రష్మిక వేర్వేరుగా ఫొటోలు పెడతారు. కానీ ఆ ఫొటోలు ఒకే చోట తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. ఇలా గతంలో ఎన్నోసార్లు చేసిందీ జంట. తాజాగా మరోసారి విజయ్, రష్మిక అభిమానులను ఇలాగే టీజర్ చేశారు. రష్మిక తాజాగా ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘‘గుడ్ ఫుడ్’’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ఐతే తర్వాత ఎవరో ఆమె ఎదురుగా విజయ్ కూర్చున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మరోసారి ఈ జంట బంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కోస్టార్‌తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా అని అడిగితే విజయ్ ఔనని సమాధానం చెప్పడం తెలిసిందే. కానీ వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇలా విజయ్, రష్మిక అభిమానులతో దోబూచులాడుతూ ఎన్నాళ్లు గడుపుతారో చూడాలి. వీళ్లిద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి కబురు చెబుతారనే అందరి అంచనా. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుండగా, రష్మిక ‘పుష్ప-2’తో పలకరించబోతోంది.
This post was last modified on November 24, 2024 2:23 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…