నాగచైతన్యతో విడిపోయిన దగ్గర్నుంచి తనతో బంధం గురించి సమంత ఎప్పుడూ నెగెటివ్‌గానే మాట్లాడడాన్ని గమనించవచ్చు. నేరుగా చైతూ పేరు ఎత్తి ఏమీ అనదు కానీ.. తన గత బంధం విషయంలో రిగ్రెట్ ఫీలవుతున్నట్లే మాట్లాడుతుంది సామ్.విడాకుల సమయంలో కొన్ని కోట్స్ పెడుతూ ఇన్‌డైరెక్ట్‌గా చైతూను ఎటాక్ చేస్తున్నట్లు కనిపించింది సామ్. ఐతే ఈ మధ్య విడాకుల బాధ నుంచి బయటికి వచ్చేసి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది సామ్. అయినా చైతూ మీద ఇన్ డైరెక్ట్ పంచ్2లు మాత్రం ఆపట్లేదామె.
తాజాగా ‘సిటాడెల్’లో తనతో కలిసి నటించిన వరుణ్ ధావన్‌తో కలిసి ఒక ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సామ్.. వరుణ్ తనను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. చాన్నాళ్ల ముందే జరిగిన ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.అందులో వరుణ్.. మీరు వృథాగా ఖర్చు పెట్టిన డబ్బు గురించి చెబుతారా అని అడిగాడు. దానికి సామ్ బదులిస్తూ.. ‘‘నా ఎక్స్‌కు ఇచ్చిన ఖరీదైన బహుమతుల విషయంలో అలా ఫీలవుతుంటా’’ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైతూ నుంచి విడిపోయిన తర్వాత తన పట్ల సామ్ ఎంత వ్యతిరేకతతో ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. సామ్‌తో విడాకులు తీసుకున్నాక చైతూ ఎప్పుడు మాట్లాడినా నోరు జారింది లేదు. కానీ సామ్ మాత్రం.. ఇన్‌డైరెక్ట్‌గా చైతూనే ఎటాక్ చేస్తూనే ఉంది. ఈ విషయంలో అక్కినేని అభిమానులు సమంత తీరును తప్పుబడుతూ ఉంటారు. కానీ ఆమె గుండెలో ఎంత బాధ ఉందో.. విడాకులు ఆమెనెంత ఇబ్బంది పెట్టాయో అని ఆమెకు మద్దతుగా మాట్లాడేవాళ్లూ ఉన్నారు.
This post was last modified on November 24, 2024 2:18 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…