Movie News

ఎదురీదుతున్న సత్యదేవ్ సినిమా!

ఎదురీదుతున్న సత్యదేవ్ సినిమా‘పుష్ప-2’ రావడానికి ముందు టాలీవుడ్లో చిన్న సినిమాల జాతర కొనసాగుతోంది. ఈ శుక్రవారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలంటే.. మెకానిక్ రాకీ, జీబ్రా, దేవకీ నందన వాసుదేవనే. ఐతే ఈ మూడు చిత్రాల్లో దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. ఉన్నంతలో ‘మెకానిక్ రాకీ’ టాక్ మెరుగ్గా కనిపించింది. దానికి ముందు నుంచే బజ్ కనిపించింది. పెయిడ్ ప్రిమియర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఐతే ప్రథమార్ధం మరీ రొటీన్‌గా ఉండడం సినిమాకు మైనస్ అయింది. సెకండాఫ్ బెటర్‌గా ఉన్నా.. ఓవరాల్ సినిమా ఎంపాక్ట్ మెరుగుపడలేదు.

శుక్రవారం ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమానే కానీ.. తర్వాత వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. శనివారం ‘మెకానిక్ రాకీ’ ఓ మోస్తరుగా ఆడిందంతే. విశేషం ఏంటంటే.. దీంతో పోలిస్తే ఎక్కువ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘జీబ్రా’ సినిమాకు వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి.‘జీబ్రా’కు ‘మెకానిక్ రాకీ’ కంటే తక్కువ రేటింగ్స్ పడ్డాయి. టాక్ కూడా నెగెటివ్‌గానే వచ్చింది. కానీ శనివారం మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ కావడం దీనికి కలిసొచ్చిన అంశంలా కనిపిస్తోంది. కన్నడ, తమిళ భాషల్లో కూడా ‘జీబ్రా’కు స్పందన పర్వాలేదు. ఆదివారం ‘మెకానిక్ రాకీ’ మీద ‘జీబ్రా’ ఆధిపత్యం చలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ పరిస్థితి దయనీయంగా ఉంది. రిలీజ్ ముందు ఈ సినిమాకు బజ్ లేదు. పైగా టాక్ మరీ బ్యాడ్‌గా ఉంది. ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ గురించి హడావుడి చేశారు కానీ.. అందులో అంత విశేషమేమీ కనిపించలేదు. అసలే బజ్ లేదు, పైగా బ్యాడ్ టాక్.. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వాషౌట్ అయినట్లే కనిపిస్తోంది.

This post was last modified on November 24, 2024 11:51 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చింత‌కాయ‌ల వ‌ర్సెస్ చిన్న‌మ్మ‌.. ఇంట్ర‌స్టింగ్ పాలిటిక్స్‌!

ఏపీలో వైసీపీ నాయ‌కుల‌ను కూట‌మి పార్టీలు చేర్చుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కు కూట‌మిలోని టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్యే ఈ…

2 hours ago

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర…

3 hours ago

ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…

5 hours ago

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా…

6 hours ago

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…

8 hours ago