చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కొదమసింహం చూసి చేతికి గాయం చేసుకునే అమాయకత్వం నుంచి అదే చిరంజీవి గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించడమంటే ఊరికే జరిగే వ్యవహారం కాదు. నువ్వు నా మూడో తమ్ముడివి అని మెగాస్టార్ నోటితోనే అనిపించుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది. కానీ సత్యదేవ్ టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. తాజాగా విడుదలైన జీబ్రాకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. దీనికి విపరీతమైన ప్రమోషన్లు చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్టుగా వచ్చారు. జీబ్రా నటీనటులతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు జరిగాయి. బ్రహ్మాజీ లాంటి ఆర్టిస్టుల సహాయంతో వెరైటీ పబ్లిసిటీ చేశారు. గత కొన్నేళ్లుగా డిజాస్టర్లు చూస్తున్న సత్యదేవ్ కు కంటెంట్ పరంగా జీబ్రా కొంచెం మెరుగ్గా అనిపించినా విడిగా చూసుకుంటే మాత్రం పెదవి విరిచేలా ఉండటం అభిమానులను కలవరపరుస్తోంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తీసుకున్న బ్యాంక్ క్రైమ్ కథ వైవిధ్యంగా ఉన్నా దాన్ని చెప్పే క్రమంలో ఓవర్ డీటెయిలింగ్ కి వెళ్లడం అయోమయానికి దారి తీయగా సెకండాఫ్ లో జరిగిన గందరగోళం అసంతృప్తిని మిగిల్చింది. క్లైమాక్స్ కొంత ఓకే అనిపించింది.
అభినయం, గాత్రం, డాన్సు ఇలా అన్ని చేయగలిగే సత్యదేవ్ కు సరైన కంటెంట్ పడటం లేదు. వినడానికి బాగానే అనిపించే గాడ్సే, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, స్కై ల్యాబ్, తిమ్మరుసు వగైరాలన్నీ దెబ్బ తినడానికి కారణం దర్శకులు పడిన తడబాట్లే. బ్లఫ్ మాస్టర్ సైతం భారీ లాభాలు తీసుకొచ్చింది కాదు. ఆన్ లైన్ వ్యూస్ డబ్బులు కాదుగా అంటూ ఆ సినిమా నిర్మాత వేసిన చురక గురించి సత్యదేవే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీపావళి సందడి తర్వాత బాగా నెమ్మదించిపోయిన బాక్సాఫీస్ దగ్గర జోష్ ని వాడుకునేలా జీబ్రా కనక ఉంటే సత్యదేవ్ జాక్ పాట్ కొట్టినట్టు అయ్యేది. కానీ అలా జరిగే సూచనలు లేనట్టే.
This post was last modified on November 23, 2024 8:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…