Movie News

రిస్కులకు దూరంగా ప్రభాస్ స్నేహితులు

ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి ప్రయాణంలో ఆ తరువాత మిడ్ రేంజ్ హీరోలతోనే మంచి విజయాలు అందుకున్నారు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతీరోజు పండగే.. లాంటి సినిమాలు టాప్ ప్రాఫిట్స్ అందించాయి. కానీ సాహో, రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాలు ఆర్థికంగా గట్టి దెబ్బ కొట్టాయి.

ఆదిపురుష్ ను తెలుగులో రిలీజ్ చేసి మరో దెబ్బ తిన్నారు. ఇక ఆమధ్య కాస్త ఆచితూచి రిస్కులు చేశారు. అవేమి పెద్దగా లాభాలు ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా కంగువా నిర్మాణంలో భాగం కాగా మరో గట్టి దెబ్బ తగిలింది. దీంతో స్పీడ్ తగ్గించిన మేకర్స్ ‘విశ్వంభర’ పైనే భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగి రిలీజ్ అయ్యే వరకు మరో రిస్క్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన రెండు సినిమాలను పక్కన పెట్టేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్‌తో ఓ సినిమా చేయడానికి యూవీ క్రియేషన్స్ చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. గోపీచంద్‌కు ఉన్న మాస్ ఇమేజ్, రాధాకృష్ణకు ఉన్న టెక్నికల్ టాలెంట్ వల్ల ఈ ప్రాజెక్ట్ విజయం సాధించగలదని సంస్థ భావించింది. అయితే, ఇటీవల గోపీచంద్ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడం, ‘విశ్వం’ వంటి సినిమాలు డిజాస్టర్ కావడం యూవీ క్రియేషన్స్‌ను ఆలోచనలో పడేసింది. అందులోనూ కంగువా కారణంగా వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 70 MM అనే మరో సంస్థ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇక అఖిల్ తో కూడా 100కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా అనుకున్నారు. కొత్త దర్శకుడు అనిల్ తో కాస్త ప్రీ ప్రొడక్షన్ కూడా చేశారు. ఇక సడన్ గా ఈ ప్రాజెక్టుతో కూడా రిస్క్ వద్దని హోల్డ్ లో పెట్టారు. అయితే లైన్ లో ఉన్న వరుణ్ తేజ్ – మెర్లపాక గాంధీ సినిమాను సేఫ్ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అది కూడా సోలోగా కాకుండా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కలిసి నిర్మిస్తున్నారు. ముందుగా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో ఈ సినిమా సేఫ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నిర్మిస్తున్నారట. ఏది ఏమైనా యూవీ వాళ్ళు ఇప్పుడు రిస్క్ లకు భయంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి ‘విశ్వంభర’ ప్రాజెక్ట్‌పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే సంస్థ తిరిగి తన పాత వైభవాన్ని అందుకోగలదనే నమ్మకంతో ఉంది.

This post was last modified on November 23, 2024 12:15 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

14 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago