టాలీవుడ్ హీరోల భార్యల్లో చాలా మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉపాసన. పెళ్లయిన కొత్తలో అందరూ ఆమెను రామ్ చరణ్ భార్యగానే చూశారు కానీ.. ఆ తర్వాతే ఆమె ఏంటో అందరికీ తెలిసింది. తమ కుటుంబానికి చెందిన అపోలో హాస్పిట్సల్స్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే అనేక మంచి కార్యక్రమాలతో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె జనాల్లో అవగాహన కోసం, అలాగే సేవా భావంతో చేసే కార్యక్రమాలు ప్రశంసలందుకుంటూ ఉంటాయి.
తాజాగా ఉపాసన ‘యువర్ లైఫ్’ పేరుతో ఒక వెబ్ సైట్ మొదలుపెట్టింది. అందులో స్టార్ నటి సమంతతో కలిసి జనాల్లో అవగాహన పెంచే వీడియోలు పెడుతోంది. శరీరం, మెదడు, చికిత్స, పోషకాహారం అనే నాలుగు ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఆమె అనేక విషయాలను నెటిజన్లతో పంచుకుంటోంది.
అంతే కాక కరోనాకు సంబంధించిన జాగ్రత్తలను కూడా ఉపాసన వివరిస్తోంది. నెటిజన్లకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తోంది. ఈ వెబ్ సైట్లోనే ‘మనం ఊరు మన బాధ్యత’ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ ప్రయత్నం కూడా చేస్తోంది ఉపాసన. అందులో భాగంగా దివ్యాంగుల్లోని నృత్య ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికి ‘హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఉపాసన. ఈ ఆన్‌లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ సైతం తన వంతు సహకారాన్ని అందించబోతున్నాడు.
తన భార్య చేస్తున్న మంచి కార్యక్రమానికి ప్రోత్సాహం అందించడం కోసం దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. డ్యాన్సుల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న చరణ్ ఒక డ్యాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం విశేషమే. భవిష్యత్తులో చిరు కూడా ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తే ఆశ్చర్యం లేదేమో. ప్రస్తుతానికి చరణ్‌తో పాటు టాప్ కొరియోగ్రఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్ సైతం షోలో పాల్గొంటారట. ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఉపాసనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on October 6, 2020 10:25 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…