ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా ఎవరు చేస్తారనే ప్రచారానికి ముగింపు పలికారు. విలక్షణ నటుడిగా పేరొందిన స్వర్గీయ ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ ని ఎంచుకున్నట్టు బాలీవుడ్ అప్డేట్. తెలుగులో ఆనంద్ దేవరకొండ పోషించిన ఆటో డ్రైవర్ పాత్రను అతనితో చేయించబోతున్నారు. కెరీర్ మొదట్లోనే ఇంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం అదృష్టమే. కాకపోతే తండ్రిని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటారు కాబట్టి నటన పరంగా వాటిని అందుకోవడం తనకు సవాల్ కాబోతోంది.
బాలీవుడ్ వెర్షన్ కు సాయి రాజేషే దర్శకత్వం వహించబోతున్నాడు. నిర్మాత ఎస్కెఎన్ కొన్ని నెలల క్రితమే ఈ విషయం చెప్పినప్పటికీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల కోసం సమయం తీసుకోవడం ప్రకటన ఆలస్యమవుతోంది. హీరోయిన్ గా ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. కృతి శెట్టి పేరు పరిశీలనలో ఉందనే టాక్ వచ్చినప్పటికీ అది నిజం కాదని తెలిసింది. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్వీ కపూర్ చెల్లి ఖుషిని అనుకున్నారు కానీ ఎందుకనో కార్యరూపం దాల్చకపోవచ్చు. మధు మంతెన ప్రధాన నిర్మాతగా వ్యవహరించబోతున్నారట.
బాబిల్ ఖాన్ కు ఇది డెబ్యూ కాదు. 2022 అన్విత దత్ తీసిన ఖలాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫ్రైడే నైట్ ప్లాన్ గుర్తింపు తీసుకురాగా యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్ లో మెరిశాడు. షూజిత్ సిర్కార్ తో వేరే సినిమా చేస్తున్నాడు. వీటి సరసన బేబీ రీమేక్ చేరనుంది. వంద కోట్లకు దగ్గరగా వెళ్లిన బేబీ ఇప్పటిదాకా బోలెడు అవార్డులు సొంతం చేసుకుంది. హిందీలోనూ సోల్ తగ్గకుండా ఉండటం కోసం సాయిరాజేష్ కు బాధ్యతలు అప్పజెప్పారు. కాకపోతే రీమేక్ తో నార్త్ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. అందుకే ఎక్కువ సమయం తీసుకుంటున్నారట.
This post was last modified on November 23, 2024 10:05 am
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే……
కోర్ట్ రూపంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ చవి చూసిన ప్రియదర్శి నెల తిరగడం ఆలస్యం ఏప్రిల్ 18న సారంగపాణి జాతకంతో…