ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. 29 ఏళ్ల వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన రెహమాన్ ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు. అయితే, ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే సమయంలో రెహమాన్ మ్యూజిక్ టీమ్‌లో మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం, ఈ రెండు సంఘటనల మధ్య సంబంధం ఉందని పుకార్లు చెలరేగాయి. దీంతో రెహమాన్ కుటుంబంపై వస్తున్న రూమర్స్ పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, రెహమాన్ కొడుకు అమీన్ ఈ పుకార్లపై సోషల్ మీడియాలో స్పందించారు.
తన తండ్రి గురించి కొన్ని తప్పుడు వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పిన అమీన్, రెహమాన్ ఒక లెజెండ్ అని, ఆయన అందించిన మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమను అందుకుందని తెలిపారు. “అసలు ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా దురదృష్టకరం. దయచేసి మా కుటుంబాన్ని గౌరవించండి,” అని అమీన్ పేర్కొన్నారు.
అదే సమయంలో, రెహమాన్ కూతురు రహీమా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “రూమర్స్ ఎప్పుడూ ద్వేషించే వారు క్రియేట్ చేస్తారు, తెలివితక్కువవారు వ్యాప్తి చేస్తారు” అంటూ కౌంటర్ ఇచ్చారు. 1995లో వివాహం చేసుకున్న రెహమాన్-సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు ఖతీజా, అమీన్, రహీమా ఉన్నారు. ఇక పుకార్లపై వారసులు ఈ విధంగా సమాధానం ఇవ్వడం, మరింత చర్చకు దారితీస్తోంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికి లేదని మరికొందరు నెటిజన్లు వారికి మద్దతు ఇస్తున్నారు.
This post was last modified on November 22, 2024 6:38 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…