అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు అయాన్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఏ ఈవెంట్ లో కనిపించినా అయాన్ వైపే కెమెరాలన్ని తిరిగిపోతుంటాయి. అయితే రీసెంట్ గా అయాన్ తన క్యూట్ చెల్లెలు అర్హతో కలిసి నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్
షోలో సందడి చేశాడు.
లేటెస్ట్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గెస్ట్ గా పాల్గొనగా.. పార్ట్ 2 ఇంటర్వ్యూలో అయాన్, అర్హలను కూడా బాలయ్య ఆహ్వానించారు. బన్నీ పిల్లల ఎంట్రీతో షోలో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయింది. తెలుగు పద్యాన్ని అనర్గళంగా చెప్పి బాలయ్యనే ఆశ్చర్యపరిచింది అర్హ. మరోవైపు అయాన్ ను యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ తో పోలుస్తూ బన్నీ నవ్వులు పంచారు. బన్నీ పిల్లలతో బాలయ్య చాలా సరదాగా గడిపారు. పొడుపు కథలు అడిగారు, టంగ్ ట్విస్టర్స్ చెప్పించారు.
ఈ క్రమంలోనే అయాన్ ను నీ ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్నించగా.. యాక్షన్ లో ప్రభాస్, డ్యాన్స్ లో చిరు తాత.. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రభాస్ నా ఫేవరెట్ హీరో అంటూ మన మోడల్ కిడ్ చాలా ఇంట్రస్టింగ్ గా సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ యాక్ట్ చేసిన బాహుబలి సినిమా అంటే తనకెంతో ఇష్టమని అయాన్ చెప్పుకొచ్చాడు. ఫేవరెట్ డైరెక్టర్ గురించి అడగ్గా.. బోయపాటి శ్రీనుకి ఓటేశాడు అయాన్. ఇక అర్హ మాత్రం శాకుంతలంలో తాను పోషించిన ప్రిన్స్ భారత క్యారెక్టర్ తన ఫేవరెట్ అని చెప్పుకురావడం గమనార్హం.
This post was last modified on November 22, 2024 2:15 pm
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…