జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ మీద ఎంత స్థాయి బజ్ ఉందనేది పక్కనపెడితే పోటీ రూపంలో తలెత్తున్న ఇబ్బంది వసూళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్య లేదు కానీ యావరేజ్ లేదా అంతకన్నా భిన్నమైన మాట వినిపిస్తే మాత్రం పోటీదారులు వసూళ్లను ఎగరేసుకుని పోతారు. అసలే రేసులో బాలకృష్ణ, వెంకటేష్ నువ్వా నేనా అంటూ హిట్లు తీసిన డైరెక్టర్లు బాబీ, అనిల్ రావిపూడితో వస్తున్నారు. ఇక్కడేమో చరణ్ కు ఇండియన్ 2 డిజాస్టర్ ముద్ర పడిన శంకర్ కాంబో కుదిరింది. సరే ఇప్పుడు టాపిక్ టాలీవుడ్ గురించి కాదు.
ప్యాన్ ఇండియా స్థాయిలో గేమ్ ఛేంజర్ కు జనవరి 10న విక్కీ కౌశల్ చావా క్లాష్ అవుతుందని కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ వర్గాలు ఉటంకించాయి. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం చావా మరో నెల వాయిదా వేసుకుని ఫిబ్రవరి 19కి వెళ్లొచ్చట. కారణాలు ఫలానా అని తెలియదు కానీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ గురించి ఎక్కువ వినిపిస్తోంది. ఇది నిజమైతే ఉత్తరాది రాష్ట్రాల్లో చరణ్ మూవీకి పెద్ద రిలీఫ్ దక్కుతుంది. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ జనవరి 10 వస్తుందా రాదానే అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. సంక్రాంతి రేసులో ఉందనే లీక్ అయితే మైత్రి వాళ్ళు ఇచ్చారు కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
సో ఎలా చూసుకున్న గేమ్ ఛేంజర్ కు చావా రూపంలో బాలీవుడ్ వైపు నుంచి ఒక పెద్ద ముప్పు తప్పినట్టే. కాకపోతే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాలి. ఈ వారంలో మూడో ఆడియో సింగల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో బజ్ మరింత పెరగాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవైపు పుష్ప 2 ఫీవర్ కమ్ముకుంటున్న తరుణంలో రామ్ చరణ్ టీమ్ మీద పెద్ద బాధ్యతే ఉంది. ఇంకో యాభై రోజుల్లో విడుదల తేదీ వచ్చేస్తుంది. దిల్ రాజు ఒకపక్క సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ ఛేంజర్ పబ్లిసిటీని చూసుకోవాలి. ట్రైలర్ లాంచ్ ని ఘనంగా జరిపాలన్న ప్లానింగ్ త్వరలో ఒక కొలిక్కి రావొచ్చు.
This post was last modified on November 21, 2024 6:37 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…