హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే.. ఇప్పుడే కాదు, ప్రస్తుతం కెరీర్ మీదే నా దృష్టి, సరైన సమయం వచ్చినపుడు చేసుకుంటా అని చెప్పడం కామన్. ఐతే ఇప్పుడో స్టార్ హీరోయిన్ తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ముందు పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను అంటున్న ఆ కథానాయికే.. ఐశ్వర్యా లక్ష్మి. ఈ మలయాళ భామ తమిళంతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి గురించి ఆమె తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
తన కొత్త చిత్రం ‘హలో మమ్మీ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనీలో పెట్టాను. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు అనిపించింది. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఐశ్వర్య స్పష్టం చేసింది.
సత్యదేవ్ ‘గాడ్సే’ మూవీతో ఐశ్వర్య తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అనువాద చిత్రం ‘మట్టి కుస్తీ’ ఆమెకు ఇక్కడ ఫాలోయిగ్ తెచ్చి పెట్టింది. అంతకంటే ముందు ఆమె తన సొంత భాష మలయాళంలో చాలా సినిమాలు చేసింది. తమిళంలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటించింది. ‘పొన్నియన్ సెల్వన్’, ‘జగమే తంత్రం’ లాంటి క్రేజీ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తోంది.
This post was last modified on November 20, 2024 5:12 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…