టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి తెలిసిందే. తన భార్యా పిల్లలతో బన్నీకి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన కూతురు అల్లు అర్హతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను తరచుగా బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అర్హ క్యూట్ లుక్స్, మాటలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీనే సంపాదించింది.
ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే ‘అన్‌స్టాపబుల్’ షోలో తండ్రితో కలిసి పాల్గొన్న అల్లు అర్హ సోషల్ మీడియా దృష్టిని బాగా ఆకర్షించింది. అర్హకు తెలుగు వచ్చా అని బాలయ్య అడిగితే.. చాలా కష్టమైన ‘అటజని కాంచె…’ పద్యాన్ని అలవోకగా చెప్పేసి పెద్ద షాకే ఇచ్చింది అర్హ. బాలయ్య సైతం తెలుగు మీద అర్హకు ఉన్న పట్లు చూసి ఆశ్చర్యపోయి తనకు ముద్దు పెట్టాడు. దీంతో తండ్రిగా బన్నీ పొంగిపోయాడు.
సోషల్ మీడియాలో అర్హ వీడియో బాగా తిరుగుతున్న నేపథ్యంలో బన్నీ తాజాగా తన కూతురితో కలిసి ఉన్న ఒక క్యూట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ఫొటోకు “అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్” అని కామెంట్ జోడించాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే మిలియన్ లైక్స్ రావడం విశేషం.
This post was last modified on November 20, 2024 5:06 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…