Movie News

పుష్ప-2.. త్రీడీ ఎందుకు మాస్టారూ?

ఇటీవలే విడుదలైన ‘పుష్ప-2’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ నిండా ఎలివేషన్ షాట్స్, మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేసిన సుకుమార్ ప్రేక్షకుల్లో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేశాడు. ట్రైలర్లోని హిడెన్ థింగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. ట్రైలర్ చివర్లో ఈ సినిమా త్రీడీలో కూడా రిలీజ్ కాబోతోందని చెప్పడం ప్రేక్షకులకు షాకే.

పుష్ప-2 త్రీడీలో వస్తుందనే సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలేదు. ‘పుష్ప-1’కు త్రీడీ వెర్షన్ లేదు. కానీ పుష్ప-2ను మాత్రం త్రీడీలో రిలీజ్ చేస్తారట. అసలు ఇలాంటి మాస్ సినిమాకు త్రీడీ వెర్షన్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్ ఫిలిమ్స్‌కే త్రీడీ మైనస్ అయింది. 2డీ వెర్షన్‌నే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. కల్కి సినిమా సైతం 2డీలోనే బెటర్‌గా అనిపించిందని రెండు వెర్షన్లూ చూసిన వాళ్లు చెప్పారు. ఇటీవలే విడుదలైన సూర్య సినిమా ‘కంగువ’ సైతం 3డీలో కంటే రెగ్యులర్ వెర్షన్‌లోనే బెటర్ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి.. న్యూ వరల్డ్ క్రియేట్ చేసిన సినిమాలను త్రీడీలో చూస్తే బాగుంటుంది.

‘పుష్ప-2’ లాంటి సినిమాలకు రెగ్యులర్ వెర్షనే బెటర్. అసలు ఇలాంటి మాస్ మూవీని త్రీడీలో తీయాలని సుకుమార్‌కు ఎందుకు అనిపించిందన్నది అర్థం కాని విషయం. 3డీలో తీస్తుంటే ముందు నుంచే దాని గురించి ప్రచారం చేయడం, ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం అవసరం. కానీ ఉన్నట్లుండి ట్రైలర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. దీని పట్ల సోషల్ మీడియాలో సానుకూల స్పందనేమీ కనిపించడం లేదు. చూస్తుంటే మేకర్స్ కూడా మొక్కుబడిగానే త్రీడీ వెర్షన్ రిలీజ్ చేసేలా ఉన్నారు. ఇది అనవసర ప్రయాస తప్ప.. ప్రత్యేక ప్రయోజనం చేకూర్చే ఆలోచనేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘పుష్ప-2’ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 20, 2024 7:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago