Movie News

డౌట్ లేదు…విజయ్ 69 భగవంత్ కేసరా ?

రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన తలపతి 69 షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. 2025 దీపావళి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. కాంతారా చాప్టర్ 1తో క్లాష్ కావొచ్చనే ప్రచారం డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో బలంగా ఉంది. ఇదిలా ఉండగా హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా బాలకృష్ణ భగవంత్ కేసరి ఆధారంగా రూపొందుతోందనే ప్రచారం జోరుగా ఉంది. ఇది షూటింగ్ టైంలోనే బయటికి వచ్చినప్పటికీ క్రమంగా ఈ వాదనకు బలం చేకూరే ఆధారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

భగవంత్ కేసరిలో బాలకృష్ణ స్నేహితుడిగా నటించిన శరత్ కుమార్ పాత్రకు తొలుత శివరాజ్ కుమార్ ని అడిగారట. కానీ ప్రాధాన్యం తక్కువగా ఉండటంతో పాటు చనిపోయే క్యారెక్టర్ కావడం వల్ల దర్శకుడే తిరిగి వద్దనుకున్నారనే టాక్ చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలే ఆర్మీ క్యాంప్ లో ఒక షెడ్యూల్ చేశారు. శ్రీలీలను పోలిన పాత్ర చేస్తున్న మమిత బైజుకు సంబంధించిన ట్రైనింగ్ ఎపిసోడ్స్ అక్కడే చిత్రీకరించి ఉండొచ్చు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్థానంలో తమిళంలో పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇక విలన్ గా అర్జున్ రాంపాల్ బదులుగా ఆ బాధ్యతను బాబీ డియోల్ తీసుకున్నాడు.

సో ఏ కోణంలో చూసుకున్నా ఇది భగవంత్ కేసరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ప్రస్తుతానికి గాసిప్ గానే తీసుకోవాలి. హెచ్ వినోత్ గతంలో పింక్ కోలీవుడ్ రీమేక్ ని చాలా మార్పులతో కమర్షియల్ కోటింగ్ ఇచ్చి మెప్పించాడు. వకీల్ సాబ్ కి దాన్నే ఫాలో అయ్యాడు వేణు శ్రీరామ్. భగవంత్ కేసరి ముందే రెడీ మేడ్ కమర్షియల్ ప్యాకేజ్. ఇక విజయ్ చివరి చిత్రంగా చేయబోయే మార్పులు ఖచ్చితంగా బెస్ట్ ఉంటాయి. ఒకవేళ ఈ టాక్ కనక నిజమైతే తెలుగు డబ్బింగ్ తో మన ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. ట్రైలర్ వచ్చేదాకా క్లారిటీ రావడం కష్టమే. 

This post was last modified on November 19, 2024 2:15 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

4 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

10 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago