ఇండియన్ సినిమా బడ్జెట్లను, వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల కిందటే ఈ సినిమా మీద రూ.250 కోట్లు పెట్టింది చిత్ర బృందం. పార్ట్-2 కోసం ఇంకా ఎక్కువే ఖర్చయింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాలు ఆ చిత్ర బడ్జెట్‌ను అధిగమించాయి.
ఇప్పుడు ఇండియన్ సినిమాల మీద ఐదొందల కోట్లు ఖర్చు పెట్టినా వర్కవుట్ అవుతోంది. దర్శకుల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు తిరుగులేని మార్కెట్ సంపాదించుకుని ఎంత బడ్జెట్ పెట్టినా రికవర్ చేయగల స్థితిలో ఉన్నారు.
ఐతే వీళ్లకున్న ఫేమ్, మార్కెట్ వేరు. కానీ ఒక టీవీ షోలో పెద్దగా పేరు లేని ఆర్టిస్టులను పెట్టి, ఎలాంటి ఇమేజ్ లేని దర్శకుడితో సిరీస్ చేసి రూ.500 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు సాహసం కాదు. ఈ సాహసాన్ని ఆరేడళ్ల కిందటే చేశారంటే ఆశ్చర్యపోక తప్పదు.
‘పోరస్’ అనే హిందీ టీవీ సిరీస్ కోసం 2017-18 ప్రాంతంలోనే ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేయడం విశేషం. గ్రీకు రాజు అలెగ్జాండర్‌తో పోరాడిన పౌరవ రాజు కథతో ‘పోరస్’ను భారీగా రూపొందించారు. ఇందులో లక్ష్ లల్వాని లీడ్ రోల్ చేశాడు. సిద్దార్థ్ కుమార్ తివారి ఈ సిరీస్‌ను క్రియేట్ చేశాడు.
ఏడాది పాటు ఈ షో రన్ అయింది. కలర్స్ టీవీ ప్రసారం చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు కావడం విశేషం. బాహుబలి లాంటి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో అంతర్జాతీయ నిపుణులతో ఈ సిరీస్‌కు విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు.
299 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ ప్రసాదరమైంది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి రివార్డులే కాదు.. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తివారి ఏషియా టెలివిజన్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్‌గా పురస్కారం కూడా అందుకున్నాడు. మన ప్రేక్షకులకు ఈ సిరీస్ గురించి పెద్దగా తెలియదు కానీ.. హిందీలో మాత్రం ఇది బాగానే పాపులర్.
This post was last modified on November 19, 2024 5:25 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…