ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ షోలోని వాళ్లంతా ఎవరికి వాళ్లు అయిపోయారు. ఒకరి మీద ఒకరు ఘాటు విమర్శలు కూడా గుప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాన్నాళ్ల పాటు జడ్జీలుగా వ్యవహరించిన రోజా, నాగబాబు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అలాగే జనసేనకు మద్దతిచ్చే జబర్దస్త్ కమెడియన్ల పట్ల రోజా గతంలో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీవాయి. ఆ తర్వాత కమెడియన్ కిరాక్ ఆర్పీ.. రోజా మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలిసిందే.
ఐతే జనసేన మద్దతుదారు అయిన మరో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సైతం రోజా మీద విమర్శలు గుప్పించినట్లు యూట్యూబ్‌లో చాలా థంబ్ నైల్స్ కనిపిస్తుంటాయి. కానీ తాను ఎప్పుడూ రోజాను ఏమీ అనలేదని హైపర్ ఆది స్పష్టం చేశాడు.
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన ‘కేశవ చంద్ర రమావత్’ అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆదితో పాటు రోజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైపర్ ఆది తన ప్రసంగంలో రోజా ప్రస్తావన తెచ్చాడు. రోజా ఈ వేడుకకు వచ్చి రాకేష్‌కు సపోర్ట్ చేయడం గొప్ప విషయం అని కొనియాడని ఆది.. “రోజాను హైపర్ ఆది ఏమని తిట్టాడో తెలుసా” అంటూ థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ వాళ్లు వైరల్ చేస్తుంటారని.. వ్యూస్ కోసం వాళ్లు అలా చేస్తుంటారే తప్ప తాను ఇప్పటిదాకా ఎన్నడూ రోజాను ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశాడు ఆది.
మరోవైపు ‘జబర్దస్త్’ను విమర్శించే వారిని ఆది తప్పుబట్టాడు. ఇందులో అడల్ట్ కామెడీ గురించి చాలామంది ఏడుస్తుంటారని.. మరి అలాంటపుడు ఎవరు చూస్తే ‘యానిమల్’ లాంటి అడల్ట్ రేటెడ్ సినిమాకు 800 కోట్ల వసూళ్లు వచ్చాయని ఆది ప్రశ్నించాడు.
This post was last modified on November 19, 2024 2:23 pm
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…