ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘కంగువ’ ఒకటి. కోలీవుడ్ బాహుబలిగా ఈ సినిమాను అభివర్ణించారు అక్కడి జనాలు. ఈ సినిమాతో సూర్య బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అనుకున్నారు. ప్రోమోలు చూసినా సూపర్ అనే అనిపించింది. కానీ ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన వాళ్లకు చుక్కలు కనిపించాయి.
వెయ్యేళ్ల కిందటి నేపథ్యం.. తెగల మధ్య పోరాటం అంటూ నేపథ్యం అయితే బాగానే తీసుకున్నారు కానీ.. కథలో వైవిధ్యం లేకపోవడం, గజిబిజి గందరగోళంగా సాగిన నరేషన్.. ఓవర్ ద టాప్ సీన్లు.. అరుపులు కేకలతో చెవుల తుప్పు వదిలించేసిన శబ్ద కాలుష్యం.. సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. తొలి రోజు మిక్స్డ్‌గా ఉన్న టాక్.. చివరికి పూర్తి నెగెటివ్‌గా మారింది. వీకెండ్లో కూడా సరైన వసూళ్లు సాధించలేకపోయింది ‘కంగువ’. వీకెండ్ తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది.
‘కంగువ’ బాక్సాఫీస్ దగ్గర పుంజుకునే అవకాశాలు లేవనే సంకేతాలే కనిపిస్తుండగా.. టీం ఇప్పుడు నిడివి తగ్గించే పనిలో పడింది. మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి 12 నిమిషాల నిడివిని తగ్గించారు. నైట్ షోల నుంచే ట్రిమ్డ్ వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఐతే ఇది చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తోంది. ఈ ఎడిటింగ్ ఏదో రిలీజ‌్‌కు ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నపుడే చేయాల్సింది. సినిమాలో తీసేయదగ్గ సీన్లు చాలానే ఉన్నాయి. నిడివి కూడా సమస్యగా మారిందీ చిత్రానికి.
ఎక్కువగా తొలి అరగంట గురించి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కొంచెం కట్ చేశారట. ద్వితీయార్ధంలోనూ కొన్ని సీన్లు లేపేశారట. కానీ ‘కంగువ’కు వీకెండ్ తర్వాత కలెక్షన్లు మరింత పడిపోయి థియేటర్లు వెలవెలబోతున్న నేపథ్యంలో ఈ కోత వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే భావిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌తో కలిసి సూర్య కజిల్ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశాడు.
This post was last modified on November 19, 2024 10:04 am
ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ దర్శకుల్లో.. హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ ఒకడు. తన…
ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ…
ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.…
పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్…
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది…