జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్రమంగా ఇక్కడి మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఫ్యాన్స్ ప్రేమగా శివన్న అని పిలుచుకునే ఈయన రామ్ చరణ్ 16లో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ 69లోనూ ఆఫర్ వచ్చిందన్నారు కానీ అంత ప్రాధాన్యం లేకపోవడంతో దర్శకుడే వద్దన్నారని బెంగళూరు టాక్. ఇదిలా ఉండగా కంగువతో పోటీ ఎందుకని మిగిలిన నిర్మాతలు సైడ్ అయిపోతే ఈయన మాత్రం భైరతి రణగల్ తో మొన్న నవంబర్ 15 వచ్చేశాడు. థియేటర్ల కొరత కారణంగా కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజయ్యింది.
చూస్తే శివన్న నమ్మకమే నిజమయ్యింది. భైరతి రణగల్ హిట్ టాక్ తో సింగల్ లాంగ్వేజ్ లోనే మంచి వసూళ్లు రాబడుతోంది. దీనికి దర్శకుడు నర్తన్. ఇదే శివరాజ్ కుమార్ తో మఫ్టీ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. ఆ సినిమాలో గెటప్ చూసే వీరసింహారెడ్డికి కాస్ట్యూమ్ డిజైన్ చేయించామని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మఫ్టీకు ముందు ఏం జరిగిందనే పాయింట్ తో ఇప్పుడీ ప్రీక్వెల్ తీస్తే ఇది కూడా విజయం సాధించే దిశగా వెళ్తోంది. అలాని ఇదేమి కొత్త కథ కాదు. రెగ్యులర్ కమర్షియల్ డ్రామా. కాకపోతే ప్రెజెంట్ చేసిన విధానం, ఎలివేషన్లు, స్టోరీ ట్రీట్ మెంట్ మాస్ వర్గాలకు నచ్చేలా బాగా కుదిరాయి.
నీటి కొరతతో అల్లాడిపోయే రోణాపుర అనే ఊరిలో బాలనేరస్థుడిగా ఇరవై ఏళ్ళు జైల్లో ఉండి లాయర్ చదువుతాడు రణగల్. అయితే కార్పొరేట్ సంస్థల ధన దాహం తన నల్ల కోటుని న్యాయం చేయనివ్వకపోవడమే కాక అమాయకుల ప్రాణాలు తీస్తోందని గుర్తించి నల్ల దుస్తులు ధరించి కత్తి పడతాడు. తప్పు చేసిన వాళ్ళను తెగ నరకడం మొదలుపెడతాడు. ఆపై జరిగేది స్క్రీన్ మీద చూడాలి. మరో విశేషం ఏంటంటే ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా రవి బస్రూర్ బీజీఎమ్ చెవులు హోరెత్తిపోయేలా కాకుండా డీసెంట్ గా సాగింది. త్వరలో తెలుగులో అనువదించి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
This post was last modified on November 18, 2024 8:47 pm
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…