Movie News

సినిమాలు కావాలి బాబూ సినిమాలు కావాలి

అన్‌లాక్‌లో భాగంగా వివిధ రంగాలకు ఊరటనిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లకు ఉపశమనాన్నిచ్చే విషయంలో మాత్రం చాలా ఆలస్యం చేసింది. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు తెరుచుకోబోతున్నాయి థియేటర్లు. ఇది థియేటర్లు నడిపించే వాళ్లకు.. థియేటర్ల కోసం సినిమాలు ఇచ్చేవాళ్లకు.. థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లకు అమితానందాన్నిచ్చిన విషయమే. మొత్తానికి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి కానీ.. వాట్ నెక్స్ట్ అని చూస్తే మాత్రం శూన్యమే కనిపిస్తోంది.

థియేటర్లు తెరుచుకుంటాయి సరే.. అవి అనుకున్న స్థాయిలో నడుస్తాయా అన్నది యాజమాన్యాల భయం. తమ సినిమాలను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ రాదేమో అన్నది నిర్మాతల భయం. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అవసరమా.. ధైర్యం చేసి వెళ్దామన్నా సరైన సినిమా థియేటర్లలో ఉంటుందా అన్నది ప్రేక్షకుల ఆందోళన.

కరోనా గురించి ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లాలంటే ప్రేక్షకులను ఆకర్షించే సినిమా ఆడుతుండాలి. కానీ రాబోయే కొన్ని నెలల్లో అలాంటి సినిమాలేవైనా వస్తాయా అన్నది సందేహంగా ఉంది. అసలు అక్టోబరు 15న థియేటర్లు ఓపెన్ చేసే ఎగ్జిబిటర్లు వాటిలో ఏ సినిమాలు వేస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చిన్న సినిమాలైనా సరే.. కొత్తవి ఏవైనా విడుదల అవుతాయా అన్నది అనుమానమే. థియేటర్లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ కాస్త పేరున్న ఏ సినిమా నిర్మాత కూడా ముందుకు రాలేదు.

ఈ పరిస్థితుల్లో పాత సినిమాలు వేస్తే ప్రేక్షకులు అసలే థియేటర్లకు రారు. ప్రస్తుతం ఓటీటీల్లో నడుస్తున్న కొత్త సినిమాలను ప్రదర్శించినా ప్రేక్షకులు రావడం సందేహమే. ఆ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందనుకున్నా సరే.. ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ రిలీజ్ కోసం పెద్ద మొత్తం సమర్పించున్న ఫ్లాట్ ఫామ్స్ థియేట్రికల్ రిలీజ్‌కు అంగీకరించకపోవచ్చు. ఒప్పందాలు ఎలా జరిగాయో తెలియదు మరి. ఈ నేపథ్యంలో థియేటర్లు నామమాత్రంగా తెరుచుకోవడం తప్పితే సినిమాలు నడవడం అన్నది ఆచరణ సాధ్యంగా అనిపించడం లేదు. పరిస్థితి చూస్తుంటే క్రిస్మస్‌కో, సంక్రాంతికో పేరున్న సినిమాలు రిలీజైతే తప్ప.. అప్పటిదాకా థియేటర్లు నడవడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది.

This post was last modified on October 5, 2020 10:20 am

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

5 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago