ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో పలకరించిన ఈ అందాల సుందరి.. సెప్టెంబరులో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ లాంటి మరో పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళికి ‘లక్కీ భాస్కర్’తో ఆకట్టుకున్న ఆమె.. లేటెస్ట్ రిలీజ్ ‘మట్కా’లోనూ నటించింది. వచ్చే శుక్రవారం రాబోతున్న ‘మెకానిక్ రాకీ’లోనూ ఆమె ఒక హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇలా వరుస రిలీజ్‌లతో సోషల్ మీడియాలో మీనాక్షి పేరు మార్మోగిపోతోంది.
తాజాగా ఆమె వరంగల్‌లో జరిగిన ‘మెకానిక్ రాకీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమంది. ఈ సందర్భంగా తాను పని చేసిన హీరోల గురించి ఒక్కో మాటలో ఆమె అందంగా తన అభిప్రాయం చెప్పింది.
ముందుగా ‘గుంటూరు కారం’లో తాను స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు గురించి ఒక్క మాటలో వర్ణించమంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పింది మీనాక్షి. ఇక ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’లో తాను కలిసి నటించిన విజయ్ గురించి చెబుతూ.. ‘నిలకడ’కు కేరాఫ్ అడ్రస్ అని పేర్కొంది. ‘లక్కీ భాస్కర్’ హీరో దుల్కర్ సల్మాన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని చెప్పింది. ‘మట్కా’ హీరో వరుణ్ తేజ్ అసలు సిసలైన జెంటిల్‌మ్యాన్ అని మీనాక్షి అభివర్ణించింది.
చివరగా ‘మెకానిక్ రాకీ’ కథానాయకుడు విశ్వక్సేన్ గురించి మాట్లాడుతూ.. కొంచెం లెంగ్తీగానే పొగిడింది మీనాక్షి. అతను ఫన్, చిల్ పర్సన్ అని.. మంచి ఎనర్జీతో ఉంటాడని.. తనలో యూత్‌ఫుల్‌నెస్ ఉంటుందని కొనియాడింది మీనాక్షి. ఈ ఏడాది మీనాక్షి నటించిన చిత్రాల్లో ‘లక్కీ భాస్కర్’ మాత్రమే సంతృప్తికర ఫలితాన్ని అందుకోగా.. మిగతావి నిరాశపరిచాయి. మరి ‘మెకానిక్ రాకీ’ ఏమవుతుందో చూడాలి.
This post was last modified on November 18, 2024 12:56 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…