సినీ రంగంలో పారితోషకాల ప్రస్తావన వస్తే అందరి దృష్టీ హీరోల మీదే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మేల్ ఆర్టిస్టులదే హవా అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సూపర్ స్టార్ల వార్షిక ఆదాయం వందల కోట్ల స్థాయికి వెళ్లిపోయింది. ఇక హాలీవుడ్ స్టార్ల సంగతి సరే సరి. ఐతే ఎప్పుడూ పురుషల గురించే ఏం మాట్లాడుకుంటాం. అమ్మాయిల సంగతి చూద్దాం. ఇంతకీ ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక ఆదాయం అందుకుంటున్న నటి ఎవరు? ఆమె వార్షిక ఆదాయం ఎంత అన్నది తెలుసుకుందాం.
అమెరికన్ టీవీ షో ‘ది మోడ్రన్ ఫ్యామిలీ’తో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన సోఫియా వెర్గారా ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం, వార్షికాదాయం పొందుతున్న నటిగా రికార్డు సృష్టించింది. ఆమె గత ఏడాది కాలంలో 43 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 315 కోట్ల పారితోషకం అందుకుంది.
ఏంజెలినా జోలీ లాంటి ప్రఖ్యాత నటిని కూడా వెర్గారా దాటేసింది. ‘ది మోడ్రన్ ఫ్యామిలీ’ షోలో ఒక్క ఎపిసోడ్‌కు మోర్గారా 50 వేల అమెరికా డాలర్లు (దాదాపు రూ.3.66 కోట్లు) పారితోషికంగా తీసుకుంటోందట. ‘ది మోడ్రన్ ఫ్యామిలీ’ షో 11వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగిసింది. ఈ షోతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ పలు సంస్థలకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్న సోఫియా అన్ని మార్గాల్లో కలిపి ఏటా రూ.300 కోట్లకు పైగానే ఆర్జిస్తోంది. సోఫియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2 కోట్ల మందికి పైగానే అనుసరిస్తున్నారు. అందులో ప్రమోషన్లతోనే కోట్ల రూపాయలు ఆమె సంపాదిస్తోంది.
ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన 2020 టాప్-10 హైయెస్ట్ పెయిడ్ నటీమణుల జాబితాలో మోర్గారా 43 మిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో నిలవగా.. ఏంజెలీనా జోలీ (35.5 మిలియన్ డాలర్లు), గాల్ గాడోట్ (31 మిలియన్ డాలర్లు), మెలిస్సా మెక్‌కార్తి (25 మిలియన్ డాలర్లు), మెరిల్ స్ట్రీప్ (24 మిలియన్ డాలర్లు), ఎమిలీ బ్లంట్ (22.5 మిలియన్ డాలర్లు), నికోల్ కిడ్మాన్ (22 మిలియన్ డాలర్లు), ఎల్లెన్ పాంపియో (19 మిలియన్ డాలర్లు), ఎలిజబెత్ మోస్ (16 మిలియన్ డాలర్లు), వియోలా డేవిస్ (15.5 మిలియన్ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.
This post was last modified on October 5, 2020 1:44 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…