ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప 2 ది రూల్ ట్రైలర్ లాంచ్ సందడి పాట్నాలో ఓ రేంజ్ లో జరుగుతోంది. పుష్ప బ్రాండ్ ఎంత బలంగా జాతీయ స్థాయిలో నాటుకుపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మామూలుగా సినిమాల మీద తక్కువ దృష్టితో ఉండే బీహార్ లో ఈ స్థాయి జనసందోహం ఎప్పుడూ చూడనిది. అందుకే అందరి కళ్ళు పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉండబోతున్నాడనే దాని మీదే ఉంది. దానికి తగ్గట్టు రెండున్నర నిమిషాల ప్యూర్ ఫైర్ నిండిన కంటెంట్ తో అల్లు అర్జున్ వచ్చేశాడు. శాంపిల్ అరాచకం ఏంటో చూపించాడు.
కథను చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ పుష్ప 2 ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో దర్శకుడు సుకుమార్ ఇందులో ఆవిష్కరించారు. డబ్బంటే లెక్కలేదనే పుష్ప వ్యక్తిత్వాన్ని జగపతిబాబు ద్వారా పరిచయం చేసి మొత్తం యాక్షన్ ఎపిసోడ్లతో నింపేశాడు. హెలికాఫ్టర్లు, పోర్ట్ హార్బర్, అడవులు, వందల కొద్దీ లారీలు, వేలాదిగా పేర్చబడిన ఎర్రచందనం దుంగలు, స్క్రీన్ మొత్తం నిండిపోయిన ఆర్టిస్టులు ఒకటా రెండా ఫుల్ కమర్షియల్ మసాలాతో నింపేశారు. పుష్ప 1 చూశాక ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో వాటికి పదింతలు ఊహించుకోమనేలా క్లూస్ ఇచ్చారు సుకుమార్. ఇక హైప్ ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం.
హెయిర్ స్టైల్ ఎడమ వైపున కాస్త తెల్ల రంగు తగిలించి కొత్తగా కనిపిస్తున్న అల్లు అర్జున్ చివర్లో అన్న డైలాగ్ ప్రకారం వైల్డ్ ఫైర్ అన్నట్టే ఉన్నాడు. ఫహద్ ఫాసిల్ కి ఈసారి ఎక్కువ స్కోప్ తో పాటు బన్నీతో నువ్వా నేనా అని తలపడేలా భారీ పోరాటాలు పెట్టేశాడు సుకుమార్. శ్రీలీల ఐటెం సాంగ్, సునీల్ అనసూయ తదితరాల షాట్లను వేగంగా చూపించారు. శ్రీవల్లి రష్మిక మందన్నతో పుష్ప రాజ్ రొమాన్స్ కన్నా ఎక్కువ ఎమోషన్ ని చూపించబోతున్నారులా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తనదైన సిగ్నేచర్ స్టైల్ లో సాగింది. డిసెంబర్ 5 దాకా ఆగడం కష్టమనేలా ఉన్న పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ రూల్ చేయడం ఖాయమే.
This post was last modified on November 17, 2024 7:45 pm
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…