Movie News

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు మించి విజ‌యం ద‌క్కించుకున్నాయి. సాధార‌ణంగా ఏ హీరోకైనా.. బాక్సాఫీస్ వ‌ద్ద చిత్రం హిట్ అనే టాక్ కోసం ఎదురు చూస్తారు. విమ‌ర్శ లు, రివ్యూలపై చాలా మంది ఆధార‌ప‌డ‌తారు. చిత్రం విడుద‌ల‌కు ముందు.. రివ్యూలు, విమ‌ర్శ‌కుల నుంచి మంచి మార్కులు ప‌డితే..ఇ క‌, తిరుగు ఉండ‌ద‌ని భావిస్తారు.

త‌మిళ‌నాడులోని అగ్ర న‌టులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్ వంటివారు కూడా.. బాక్సాఫీసుపై ఆధార‌ప‌డి ఉంటారు. వీరి సినిమాల‌కు మంచి రివ్యూలు, విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో ఆయా సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర భారీ స‌క్సెస్ రేటును డ‌బ్బును కూడా కూడ‌గ‌ట్టుకున్నాయి. అయితే.. ద‌ళ‌ప‌తివిజ‌య్ విష‌యంలో మాత్రం విమ‌ర్శ‌లు, రివ్యూలు ఎలా ఉన్నా.. సినిమాలు విడుద‌ల‌య్యాక మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాయి.అంటే.. క్రిటిక్స్, రివ్యూస్ తో సంబంధం లేకుండా మ‌రీ ముఖ్యంగా మౌత్ టాక్‌కి కూడా సంబంధం లేకుండా.. విజ‌య్ త‌న సినిమాల‌ను విజ‌యవంతం చేసుకున్నాడు.

ఫ్యామిలీ క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో దాదాపు ఇరవై దేశాలలో మంచి మార్కెట్ ఉన్న ఏకైక హీరోగా ద‌ళ‌ప‌తి విజ‌యం పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌త‌రించారు.సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన చివ‌రి 4 సినిమాలు బీస్ట్, వరిసు, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్). ఈ నాలుగింటిలో ఒక్క సినిమా కూడా ఏకగ్రీవంగా ఎవ‌రి నుంచి సానుకూల రివ్యూకు నోచు కోలేదు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం క‌న‌క వ‌ర్షం కురిపించాయి.

అంటే.. మౌత్ ప‌బ్లిసిటీ ఎలా ఉన్నా.. సినిమాలు మాత్రం సూప‌ర్ హిట్ కొట్టాయి. దీనిని బ‌ట్టి.. ఇప్పుడు సొంత పార్టీ `తమిళగ వెట్రి కళగం` కూడా హిట్ అవుతుంద‌న్న చ‌ర్చ సాగుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. ఈ పార్టీపై పెద్ద‌గా అంచ‌నాలు లేవు. విజ‌య్ సినిమాల మాదిరిగానే ఈ పార్టీపై కూడా పెద్ద‌గా సానుకూల వాతావ‌ర‌ణం.. కామెంట్లు రావ‌డం లేదు.

అయితే.. ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. రివ్యూలు వ‌చ్చినా విజ‌య్ సినిమాలు హిట్ అయిన‌ట్టే ఆయ‌న పార్టీ కూడా హిట్ కొడుతుంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో రాజకీయాలపై విజ‌య్‌ పూర్తి దృష్టి పెట్టారు. దీంతో సినిమాల‌ను ప‌క్క‌న పెట్టారు. ఇదినిర్మాత‌ల‌ను కొంత నిరాశ‌కు గురి చేసినా.. రాజ‌కీయంగా ఆయ‌న సైలెంట్ వేవ్‌సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on November 17, 2024 2:11 pm

Share

Recent Posts

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

33 minutes ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

1 hour ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

2 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

3 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

4 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

5 hours ago