మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ ట్రెండ్ కి మినహాయింపుగా నిలుస్తోంది. మొన్న విడుదలైన కంగువ బుక్ మై షోలో సగటున 5 వేల లోపే టికెట్లు అమ్ముతుంటే మూడో వారంలో ఉన్న అమరన్ ఏకంగా 8 వేల టికెట్లతో ముందంజలో ఉండటం ట్రేడ్ ని నివ్వెరపరుస్తోంది. తమిళనాడు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కంగువ కన్నా ముందు అమరన్ షోలు ఫుల్ కావడం ఊహించని పరిణామం. కంగువ మూడో రోజు కలెక్షన్ ఎంత వచ్చినా అమరన్ సైతం అయిదారు లక్షల తేడాతో అంతే మొత్తం సాధించే దిశగా వెళ్తోంది.
ఇది సూర్య అభిమానులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ కంగువకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే సీన్ వేరుగా ఉండేది. అమరన్, లక్కీ భాస్కర్ లకు ఇచ్చిన షోలలో కోత వేసి కంగువకు ఇచ్చే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడా సూచనలు దరిదాపుల్లో లేవు. పైగా రివర్స్ జరిగే ప్రమాదం ఉండటం కలవరపరిచే విషయం. తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీలు తీవ్రంగా పడిపోయాయి. సూర్యని బాగా ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులను సైతం కంగువ కనీస స్థాయిలో మెప్పించలేకపోయిందని వసూళ్లు చెబుతున్నాయి. కుటుంబాలకు వీకెండ్ ఛాయస్ మళ్ళీ అమరన్ కాగా తర్వాత లక్కీ భాస్కర్ నిలుస్తున్నాడు.
ఈ ట్రెండ్ రేపు ఆదివారం కొనసాగనుంది. రెండు వేల కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని కంగువ నిర్మాత చెప్పిన మాటలకు భిన్నంగా అందులో కనీసం పావు వంతు అయిదు వందల కోట్లు కలెక్ట్ చేయడం అసాధ్యమనేలా సీన్ మారిపోయింది. అలాని తమిళనాడులో భీభత్సమైన బుకింగ్స్ లేవు. కాకపోతే ఉన్నంత సూర్య ఇమేజ్ కవచంలా నిలబడి డీసెంట్ గా లాగుతోంది. కానీ సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్ ని ఊహించుకుని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ గోట్ లా పెర్ఫార్మ్ చేసి ఉంటే టెన్షన్ లేదు కానీ అలా జరిగకపోవడమే ట్రాజెడీ .
This post was last modified on November 16, 2024 9:54 pm
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…
కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త…
బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…