ఒకప్పుడు అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతంతో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అతడి చేతికి సంగీతం బాధ్యతలు అప్పగిస్తే దర్శకులు, నిర్మాతలు గుండెల మీద చేయి వేసుకుని ఉండొచ్చని, ప్రశాంతంగా మిగతా పనులు చూసుకోవచ్చని పేరుండేది. కానీ గత కొన్నేళ్లలో దేవి సంగీతంలో క్వాలిటీ తగ్గిన మాట వాస్తవం. అందుకు ఉదాహరణగా చాలా సినిమాలు కనిపిస్తాయి.
ఐతే మధ్య మధ్యలో ‘పుష్ప’ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడతను. కానీ ‘పుష్ప-2’ చిత్రానికి తన బదులు వేరే వాళ్లలో సుకుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నాడనే సమాచారం బయటికి రావడం కలకలం రేపింది. ఇది దేవి పతనానికి సూచికగా పేర్కొన్నారు చాలామంది. ఇలాంటి టైంలో దేవి సంగీతం అందించిన భారీ చిత్రం ‘కంగువ’ రిలీజైంది. ప్రోమోలు, పాటల్లో మ్యూజిక్ బాగుండడంతో రిలీజ్ తర్వాత దేవి పేరు మార్మోగుతుందని అభిమానులు ఆశించారు.
కానీ ‘కంగువ’ బ్యాడ్ టాక్‌తో మొదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దర్శకుడు శివ తర్వాత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నది దేవినే కావడం గమనార్హం. సినిమా అంతా అరుపులు కేకలతో నిండిపోయిందని.. ఆర్టిస్టుల అరుపులు చాలవని దేవి తన లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో చెవుల తుప్పు వదలగొట్టేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. శబ్దాల హోరు పెంచేసి సౌండ్ బాక్సులు దద్దరిల్లేలా చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని.. దేవి కూడా అదే చేశాడని అతణ్ని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
ఐతే ఇలా విమర్శలు ఎదుర్కొన్న ఒక్క రోజులోనే దేవికి ప్రశంసలూ దక్కుతుండడం విశేషం. అతను సంగీతం అందించిన ‘కుబేర’ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. టీజర్‌తో కమ్ముల పెద్ద షాకే ఇచ్చాడు. తన శైలికి భిన్నంగా ఇంటెన్స్ థ్రిల్లర్ తీసినట్లున్నాడతను. ఈ టీజర్లో విజువల్స్‌ను మించి బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. అందరూ స్కోర్ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఓవైపు దేవి ఒకే సమయంలో ‘కంగువ’ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే మరోవైపు ‘కుబేర’ విషయంలో ప్రశంసలు అందుకుంటుండడం చిత్రమే.
This post was last modified on November 16, 2024 9:43 pm
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…