తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న ఆయన.. ఇప్పటికీ ట్రెండీ డైరెక్టర్‌గా, ఇప్పటి యూత్‌కూ ఫేవరెట్‌గా ఉన్నారు. రాశి కంటే వాసి గొప్పదని చాటుతాయి ఆయన సినిమాలు. తాను తీసిన ఫ్లాప్ సినిమాలతో కూడా ప్రశంసలు అందుకున్న దర్శకుడాయన. ఐతే అంతా బాగుంది కానీ.. సుకుమార్ ఒక పట్టాన సినిమాను పూర్తి చేయడని.. రైటింగ్, షూటింగ్ విషయంలో బాగా ఆలస్యం చేస్తాడని.. ఏదీ ఒక పట్టాన ఓకే చేసి క్లియర్ చేయడనే విమర్శలు ఉన్నాయి.
ఆయన ప్రతి సినిమాకూ షెడ్యూళ్లు ఆలస్యం అవుతుంటాయి. అనుకున్న ప్రకారం సినిమాలు పూర్తి కావు. మొదట అనుకున్న రిలీజ్ డేట్‌కు సినిమా థియేటర్లలోకి రాదు. ‘పుష్ప-2’ విషయంలోనూ ఇదే జరిగింది. ఆగస్టు 15కే రావాల్సిన ఈ చిత్రం డిసెంబరు 5కు వాయిదా పడింది. ఒక దశలో ఆ డేట్‌ను అందుకోవడం కూడా కష్టమే అన్న సందేహాలు కలిగాయి.
సుకుమార్ ఎప్పట్లాగే షూట్ ఆలస్యం చేయడం.. షెడ్యూళ్లకు మధ్య మధ్యలో బ్రేకులు పడడం.. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు రావడంతో ‘పుష్ప-2’ షూటింగ్ మీద అనేక సందేహాలు ఏర్పడ్డాయి. డిసెంబరు 5న కూడా సినిమా రావడం చాలా కష్టమే అనే సందేహాలు కలిగాయి. కానీ గత నెల రోజుల్లో మాత్రం ‘పుష్ప-2’ షూటింగ్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని అందుకుంది.
సుకుమార్ మునుపెన్నడూ లేని వేగంతో నెల రోజులుగా షూటింగ్ చేస్తున్నాడు. రెండు మూడు యూనిట్లతో షూటింగ్స్ చేయిస్తూ ఒక చోట్ల తనే ఛార్జ్ తీసుకోవడం, ఇంకో చోట తన పర్యవేక్షణలో అసిస్టెంట్లతో సన్నివేశాలు తీయడం.. మరోవైపు ఎడిటింగ్ వ్యవహారాలూ చూసుకోవడం.. ఇలా ఆయన రేయింబవళ్లు సినిమా కోసం కష్టపడుతున్నారు. నిజానికి సుకుమార్ స్పీడు ప్రకారం చూస్తే నెలాఖరు వరకు షూటింగ్ కొనసాగుతుందని, ‘పుష్ప-1’ తరహాలోనే చివరి నిమిషంలో హడావుడి తప్పదని అనుకున్నారు. కానీ గత కొన్ని రోజుల్లో సూపర్ స్పీడులో షూట్ చేయడం వల్ల ఇంకో మూణ్నాలుగు రోజుల్లో షూట్ పూర్తి కాబోతోందని సమాచారం. అంతే కాక విడుదలకు పది రోజుల ముందే సెన్సార్ కూడా పూర్తి చేయబోతున్నారట. సెన్సార్ స్లాట్ కూడా బుక్ అయిపోయిందని తెలిసింది. ఈ ఆదివారం ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 16, 2024 9:49 pm
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు.…
హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న…
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు…
టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో…
34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో…
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు…