అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా పాటించాడు తేజ సజ్జ. ఇటీవలే అబూ దాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో రానా దగ్గుబాటితో పాటు యాంకర్ గా వ్యవహరించిన తేజ కొన్ని ఫ్లాప్ సినిమాల మీద వేసిన సెటైర్లు ఆయా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వ్యవహారం పట్ల గుర్రుగా ఉన్నారు. నిన్న రానాని అడిగితే ఇకపై ఇది జోకని సబ్ టైటిల్స్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని, హాస్యాన్ని అర్థం చేసుకోలేకపోయారని వ్యంగ్యంగా పంచులు వేశాడు.
సరే రానా అంటే సీనియర్ మోస్ట్ కాబట్టి ఎలా అన్నా ఇబ్బందేం లేదు కానీ తేజ సజ్జ మాత్రం ఈ విషయంలో మెచ్యూర్ గా ఆలోచించాడు. ఒక ఈవెంట్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు బదులు చెబుతూ చిన్నప్పటి నుంచి ఎవరితో అయితే నటిస్తూ పెరిగానో వాళ్ళ మీద ఎలా కామెడీ చేస్తానని వివరణ ఇచ్చాడు. ఐఫా లాంటి ఇంటర్నేషనల్ వేడుకలో స్క్రిప్ట్ పలు దశలను దాటుకుని సిద్ధమవుతుందని, దాన్నే స్టేజి మీద చేస్తాం తప్పించి ఎలాంటి దురుద్దేశం లేదని అన్నాడు. నిజానికి రానా తన మీద వేసిన జోకులను పూర్తి వీడియో చూడకుండా వేరొకరికి ఆపాదించారని చెప్పుకొచ్చాడు.
ఇది ఫ్యాన్స్ ని ఎంతమేర సంతృప్తి పరుస్తుందనేది పక్కనపెడితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకుండా ఇలా స్పష్టంగా సమాధానం చెప్పడం మంచిదే. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక తేజ తొందరపడి సినిమాలు చేయడం లేదు. ఆలస్యమైనా సరే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే మిరాయ్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.
This post was last modified on November 16, 2024 5:29 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…