నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్ కొద్దిరోజుల క్రితమే వచ్చినప్పటికీ టీజర్ కు సంబంధించిన వర్క్ పెండింగ్ ఉండటంతో దీపావళి పండుగకు ప్లాన్ చేసుకున్న అనౌన్స్ మెంట్ ఈ రోజుకు మార్చారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్యకు మరో అదిరిపోయే హిట్టు ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ దీని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ ఈ స్క్రిప్ట్ మీద నెలల తరబడి సమయం వెచ్చించాడు. ఇవాళ నిమిషంన్నర టీజర్ ద్వారా డాకు ప్రపంచాన్ని పరిచయం చేశారు.
అదో సుదూర ఎడారి లాంటి నిర్మానుష ప్రాంతం. అక్కడ దేవుళ్ళు ఉండరు. వినాశనం కోసమే పూనుకున్న మృగాలు కొలువు తీరి ఉంటాయి. వీళ్ళ ఆగడాలకు ఎన్నో అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ దుర్మార్గాలను అడ్డుకోవడానికి వస్తాడు డాకు మహారాజ్. మరణాన్నే వణికించే అతను దారుణమైన ముఠాతో తలపడేందుకు సిద్ధపడతాడు. అసలు అతనికి డాకు మహారాజ్ అనే పేరు ఎలా వచ్చింది, శత్రు సంహారానికి ఎందుకు పూనుకోవాల్సి వచ్చిందనేది తెరమీద చూడాలి. విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. ఎప్పటిలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సన్నివేశాలను నిలబెట్టాడు.
జనవరి 12 డాకు మహారాజ్ థియేటర్లో అడుగుపెట్టబోతున్నాడు. సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి కలిసివస్తుందనే ధీమా ఫ్యాన్స్ లో ఉంది. పండగ సందడి జనవరి 10 గేమ్ ఛేంజర్ తో మొదలుకాబోతున్న నేపథ్యంలో బాలయ్య రెండు రోజుల తర్వాత రాబోతున్నాడు. వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం సైతం రేసులో ఉంది. సందీప్ కిషన్ మజాకా, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్ రావాల్సి ఉంది. గత మూడు సినిమాలతో పోలిస్తే వాటికి పూర్తి భిన్నమైన మాస్ గెటప్ లో డాకు మహారాజ్ అలరించబోతున్నాడు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి, రవి కిషన్, బాబీ డియోల్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
This post was last modified on November 15, 2024 10:55 am
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…