ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు తమిళ అనువాదం ‘అమరన్’ సైతం మంచి స్పందన తెచ్చుకుంది. మూడూ వసూళ్ల పంట పండించుకున్నాయి. ఐతే ఆరంభంలో ‘క’, ‘అమరన్’ చిత్రాలే ఎక్కువ వసూళ్లు సాధించగా.. ‘లక్కీ భాస్కర్’ కొంచెం వెనుకబడ్డట్లు కనిపించింది.
నిజానికి ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది ‘లక్కీ భాస్కర్’కే. కాకపోతే అది క్లాస్ మూవీ కావడం, బ్యాంకు మోసాల కాన్సెప్ట్ అందరికీ అర్థం కాకపోవడం వల్ల మాస్‌లో దీనికి రీచ్ తక్కువగా కనిపించింది. థియేటర్లలో జనం పలుచగా కనిపించారు. కానీ కంటెంట్ ఉన్న సినిమా కొంచెం లేటుగా అయినా సక్సెస్ అవుతుందనే విషయాన్ని ఈ చిత్రం నిరూపించింది. ‘క’ ఆరంభ మెరుపుల తర్వాత కొంచెం వీక్ అయింది. కానీ ‘లక్కీ భాస్కర్’ నిలకడగా వసూళ్లు సాగిస్తూ ముందుకు వెళ్లింది.
మూడో వారంలో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి. తమిళం, మలయాళంలో ఈ చిత్రం బాగా పుంజుకుంది. ఆ భాషల్లో కొత్త సినిమాలాగా ఆడుతోంది. మలయాళం దుల్కర్ సల్మాన్ సొంత భాష కావడం, అక్కడను పెద్ద స్టార్ కావడంతో ‘లక్కీ భాస్కర్’ అదరగొడుతోంది. మూడు భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తూ సాగడంతో ‘లక్కీ భాస్కర్’ ఇప్పుడు ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేయడం విశేషం. ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు ఆ మార్కును అందుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల వసూళ్లు రూ.40 కోట్లకు పైగానే ఉండగా.. మలయాళ వెర్షన్ రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తమిళంలో ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. కర్ణాటక, ఓవర్సీస్‌లో కూడా సినిమా చాలా బాాగా ఆడుతోంది. మొత్తంగా ‘లక్కీ భాస్కర్’ గ్రాస్ కలెక్షన్లు వంద కోట్లు దాటేశాయి. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద విజయమే. కంటెంట్ విన్నర్ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవడం ఎప్పుడూ ప్రత్యేకమే.
This post was last modified on November 15, 2024 6:22 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…