Movie News

‘ఆఫీస‌ర్’‌ ప‌రువు అక్క‌డ కూడా తీస్తున్నారా?

అక్కినేని నాగార్జున కెరీర్లో ఆయ‌న‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ అత్యంత ఘోర ప‌రాజ‌యాన్ని, అవ‌మాన భారాన్ని మిగిల్చిన సినిమా అంటే ఆఫీస‌ర్ అనే చెప్పాలి. నాగార్జున‌కు శివ లాంటి మైల్ స్టోన్ మూవీని అందించిన రామ్ గోపాల్ వ‌ర్మ రెండేళ్ల కింద‌ట తెర‌కెక్కించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే ప్రేక్ష‌కుల తిర‌స్కారానికి గురైంది.

బ్యాడ్ రివ్యూలు.. పేల‌వ‌మైన టాక్ ఈ సినిమా ఒక్క రోజు తిరిగేస‌రికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌ళ్లు తేలేసేలా చేశాయి. ఈ సినిమాకు వ‌చ్చిన షేర్.. థియేట‌ర్ల మెయింటైనెన్స్, ప‌బ్లిసిటీ ఖ‌ర్చుల‌కే స‌రిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. మొత్తంగా కోటి రూపాయ‌ల షేర్ కూడా రాని దుస్థితి. ఈ సినిమా గురించి కానీ, వ‌ర్మ గురించి కానీ మాట వర‌స‌కు కూడా నాగ్ ఎత్త‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక సోష‌ల్ మీడియాలో అక్కినేని అభిమానులు ఫ్యాన్ వార్స్ జోలికి వెళ్తే ఆఫీస‌ర్ ప్ర‌స్తావ‌న తెచ్చి వాళ్లు చిన్న‌బుచ్చుకునేలా చేస్తుంటారు అవ‌త‌లి అభిమానులు. ఇంత‌గా ఆఫీస‌ర్ అక్కినేని వారిని వెంటాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఆ సినిమా తాలూకు చేదు జ్ఞాప‌కాల్ని ఓ త‌మిళ నిర్మాత మ‌ళ్లీ గుర్తు చేస్తున్నాడు. ఆఫీస‌ర్ సినిమా హ‌క్కులు కొని వేట‌క్కార‌న్ (వేట‌గాడు) పేరుతో తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడా నిర్మాత‌. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు కూడా.

నాగార్జున, వ‌ర్మ కాంబినేష‌న్లో వ‌చ్చిన శివ త‌మిళంలోనూ హిట్ట‌యింది. గీతాంజలి, అన్నమయ్య సినిమాలతోనూ నాగ్ అక్కడ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే ప్రయత్నం జరుగుతోంది. ‘శివ’ కాంబినేష‌న్ రిపీట్ అంటూ అక్క‌డ ప‌బ్లిసిటీ చేస్తున్నారు. ఈ సోష‌ల్ మీడియా కాలంలో ఆఫీస‌ర్ రిజ‌ల్టేంటో త‌మిళ జ‌నాల‌కు తెలియ‌దు. ఆఫీస‌ర్ సినిమాకు తెలుగులో పోయిన ప‌రువు చాల‌ద‌ని త‌మిళంలోనూ తీస్తారా అని ప్ర‌శ్నిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

This post was last modified on October 4, 2020 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

6 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago