తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో దీనికి మాంచి హైప్ వచ్చింది. ఐతే రిలీజ్ ముంగిట వచ్చిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఒకరకమైన నెగెటివిటీ ముసురుకుందీ చిత్రం చుట్టూ. పైగా మిడ్ నైట్ షోల నుంచి డివైడ్ టాక్ వచ్చింది. వీటన్నింటినీ తట్టుకుని ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. థియేటర్లలో నెల రోజుల పాటు బాగా ఆడి బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టింది.
ఐతే థియేటర్లలో ఈ సినిమా మంచి స్పందనే తెచ్చుకుంది కానీ.. ఓటీటీలోకి వచ్చాక మాత్రం రెస్పాన్స్ చాలా వరకు నెగెటివ్‌గానే ఉంది. థియేటర్లలో ఉండగా సోషల్ మీడియాలో నెగెటివిటీని దీటుగా ఎదుర్కొంటూ సినిమాను భుజాల మీద మోసిన తారక్ ఫ్యాన్స్.. ఓటీటీలో వచ్చాక మాత్రం స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనించవచ్చు.
‘దేవర’ డిజిటల్ రిలీజ్ తర్వాత ఎక్కువగా ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్లు పెట్టింది తారక్ ఫ్యాన్సే అంటే అతిశయోక్తి కాదు. తాము ఆశించిన స్థాయిలో అయితే సినిమా లేదని.. క్లైమాక్స్ తేలిపోయిందని.. సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ బాగా లేదని వాళ్లు కొన్ని రోజుటుగా పోస్టులు పెడుతున్నారు. వీళ్ల ఫీడ్ బ్యాక్‌తో ఆవేదన నుంచి వస్తున్నట్లే కనిపిస్తోంది. దాన్ని జెన్యూన్‌గానే భావించవచ్చు. వీరిలో ఎక్కువమంది ‘దేవర-2’ పట్ల సంతృప్తిగా లేనట్లే కనిపిస్తోంది. ఈసారికి సినిమాను మోశాం కానీ.. ఇదే తరహలో దేవర-2 ఉంటే కష్టమని.. అసలు సీక్వెల్ తీయకపోతే ఉత్తమమని వాళ్లు అభిప్రాయపడుతుండడం గమనార్హం.
ఐతే ముందు సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటికీ ఫస్ట్ పార్ట్ ఫెయిలైతే.. రెండో పార్ట్ తీయడం ఆపేస్తారు. కానీ ‘దేవర’ థియేటర్లలో సక్సెస్ ఫుల్ ఫిలిం అనిపించుకున్న నేపథ్యంలో పార్ట్-2 తీయడానికే మేకర్స్ చూస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సహా నెటిజన్ల నుంచి గత కొన్ని రోజులుగా వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తే మాత్రం ‘దేవర-2’ తీయాలా వద్దా అనే మీమాంసలో మేకర్స్ పడిపోతారేమో.
This post was last modified on November 15, 2024 6:11 am
అసలు శతదినోత్సవం అనే మాటే సినీ పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయింది. మూడు నాలుగు వారాలకు బ్రేక్ ఈవెన్ అయితే అదే…
ఈ రోజు సాయంత్రం జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమండ్రి సిద్ధమయ్యింది. సుమారు లక్షన్నర మందికి…
సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ.. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటిముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు ఆకాశంలో…
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ…
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య…
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకడు. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర…