లీడర్ తో దగ్గుబాటి రానా హీరోగా పరిచయమైనప్పుడు వెంకటేష్ తర్వాత ఆ కుటుంబం నుంచి మరో ప్రామిసింగ్ స్టార్ వచ్చాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. నేనే రాజు నేనా మంత్రి లాంటి ఒకటి రెండు హిట్లు ఉన్నప్పటికీ పెద్ద రేంజ్ బ్లాక్ బస్టర్ సాధించలేకపోయాడు. బాహుబలిలో విలన్ పాత్ర చేశాక కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరే నెగటివ్ షేడ్స్ ని బ్రహ్మాండంగా మెప్పించాడు. రానా నాయుడు వెబ్ సిరీస్ లోనూ రిస్క్ తీసుకుని ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిలో పాసయ్యాడు. కానీ ఇదంతా అభిమానులు పూర్తిగా ఆస్వాదించడం లేదు.
విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఉంటూ నెంబర్ వన్ యారీతో పాటు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కోసం మరో ఇంటర్వ్యూ షో చేస్తూ హీరోగా కెరీర్ ని పక్కనపెట్టడాన్ని వాళ్ళు తప్పుబడుతున్నారు. నిజానికి రానా చేస్తోంది రైటేనని చెప్పడానికి కొన్ని పాయింట్లున్నాయి. రానా నటన పరంగా వంకలు లేకపోయినా, ఆరడుగుల ఎత్తు ఉన్నా తను కంప్లీట్ కమర్షియల్ హీరో మెటీరియల్ కాదు. ఛాలెంజ్ అనిపించే పాత్రలు, రిస్క్ ఇచ్చే సబ్జెక్టులే సూటవుతాయి. దీన్ని ముందు గుర్తించింది రాజమౌళే. దానికి అనుగుణంగానే రానా తన ప్లానింగ్ ని మార్చుకుని హీరోయిజం ఉచ్చులో పడకుండా నటుడిని మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు.
ఇంకో వైపు నిర్మాతగా చిన్న సినిమాలకు అండగా నిలబడేందుకు ఎన్ని చేయాలో అంతా చేస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం నుంచి 35 చిన్న కథ కాదు దాకా ఎన్నో అవార్డు విన్నింగ్ సినిమాలకు దన్నుగా నిలబడి వాటి థియేట్రికల్ రిలీజ్ కు మద్దతు ఇచ్చాడు. ఫలితంగా అవి మెజారిటీ ఆడియన్స్ ని చేరుకున్నాయి. సందీప్ కిషన్ మొన్నో ఈవెంట్ లో మాట్లాడుతూ రానా చిన్న నిర్మాతలకు ఒక సపోర్టింగ్ సిస్టంగా మారడాన్ని వివరించాడు. సో రానా వెళ్తున్న రూటు తప్పనడానికి లేదు. ఆర్టిస్టుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, యాంకర్ ఇలా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంటున్న టైంలో హీరోగా కొనసాగకపోతే మునిగేది ఏముంది.
This post was last modified on November 14, 2024 11:37 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…