Movie News

పరుచూరి పలుకుల్లో దేవర రివ్యూ

అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్ మైనస్సులు నిశితంగా పరిశీలించి రాబోయే దర్శకులకు పాఠాలుగా చెబుతుంటారు. థియేటర్లో చూసేందుకు సాధ్యపడని వాటిని ఓటిటిలో వచ్చాక వీక్షించి చక్కని రివ్యూలు ఇస్తారు.

గతంలో గుంటూరు కారం గురించి విశ్లేషణ చేసినప్పుడు ఇది కదా అనుభవంతో నేర్పించే లెసన్సని అందరూ భావించారు. ఇప్పుడు దేవర వంతు వచ్చింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ జరుపుకున్న దేవరని చూశాక తనదైన శైలిలో కొన్ని చక్కని విషయాలు చెప్పారు గోపాలకృష్ణ.

ఆయన వివరించిన ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. కథ చాలా చిన్నది అయినప్పటికీ కథనం ఆకర్షణీయంగా ఉండటం దేవర సక్సెస్ కు ఒక కారణమైతే, దమ్మున్న హీరోల్లో ఒకడైన చిన్న రామయ్య (జూనియర్ ఎన్టీఆర్) చేశాడు కాబట్టి ఇంత విజయం అందుకుంది.

అధిక భాగం సముద్రంలో నడిపించినప్పటికీ కొరటాల శివ స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించే స్థాయిలో ప్రెజెంట్ చేసిన తీరు భారీ హిట్టుని తెచ్చి పెట్టింది. ఒకవేళ వర, జాన్వీ కపూర్ మధ్య రొమాన్స్, కామెడీని మరింత జొప్పించి ఉంటే మాస్ అండతో ఇంకా ఎక్కువ అంటే వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చేవి. సెకండాఫ్ లో అధిక శాతం చేసిన కంప్లయింట్ ఇదే.

తారక్ నటన సహజంగా ఉందని మెచ్చుకున్న గోపాలకృష్ణ సంగీతం మాత్రం అంత గొప్పగా లేదని చెప్పడం కొసమెరుపు. అంటే అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తాలూకు మేజిక్ ఆస్వాదించాలనంటే థియేటర్ లో డాల్బీ సౌండ్ అయితేనే కరెక్ట్. అలాంటిది ఇంట్లో చూసినప్పుడు కొంత అనుభూతి తగ్గే రిస్క్ లేకపోలేదు.

బహుశా గోపాలకృష్ణ గారికి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వందల సినిమాలకు రచన చేసి అలనాటి స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ దాకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ కు పని చేసిన గోపాలకృష్ణ ఇంత నిశితంగా రివ్యూ చేశాక ఇక చెప్పదేముంటుంది.

This post was last modified on November 14, 2024 11:18 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago