బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ల సమస్యతో సతమతం అయింది. థియేటర్లతో ఆదాయం పంపకాల విషయంలో అంగీకారం కుదరకపోవడం ఓ సమస్య కాగా.. మంచి రన్‌తో సాగుతున్న అమరన్‌ను చాలా థియేటర్లు కొనసాగించడానికి నిర్ణయించడం మరో సమస్య.
ఐతే తమిళనాట రిలీజ్ ముందు రోజు సమస్య పరిష్కారమై మెజారిటీ స్క్రీన్లు దక్కాయి కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. మల్టీప్లెక్సులతో రెవెన్యూ షేరింగ్ దగ్గర మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు పీటముడి పడడంతో పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ స్క్రీన్లలో ఎంతకీ బుకింగ్స్ మొదలు కాలేదు.
రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా చాలా తక్కువ స్క్రీన్లలో మాత్రమే షోలు పెట్టారు. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. హైదరాబాద్ లాంటి సిటీల్లో మేజర్ మల్టీప్లెక్సులు కంగువ షోలు పెట్టకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ స్క్రీన్లలో కంగువ షోలు ఉండవని అంతా ఫిక్సయిపోయిన సమయంలో రాత్రి పదిన్నర ప్రాంతంలో సస్పెన్సుకు తెరపడింది. పీవీఆర్ సహా అన్ని ప్రధాన మల్టీప్లెక్సులూ కంగువ షోలు ఓపెన్ చేశాయి. మరి రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏం ఒప్పందం జరిగిందో ఏమో కానీ.. రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సమస్య పరిష్కారం అయింది.
కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం కనీసం నాలుగు రోజుల ముందు బుకింగ్స్ మొదలు కావాల్సింది. కంగువకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పెద్ద ఎత్తున ఉదయం షోలు వేసుకోవడానికి అవకాముంది. టికెట్లు కూడా బాగా తెగేవి.
కానీ రిలీజ్‌కు కొన్ని గంటల ముందు వరకు బుకింగ్స్ లేకపోవడంతో తొలి రోజు ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడనుంది. తెలుగులో ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప కంగువ బ్రేక్ ఈవెన్ కాదు. కానీ లేట్ బుకింగ్స్ వల్ల తొలి రోజు కలెక్షన్లలో బాగానే గండి పడబోతోంది. సినిమాకు టాక్ బాగుంటే తర్వాత కలెక్షన్లు పుంజుకోవచ్చు కానీ.. ముందేతే పెద్ద గండి పడినట్లే.
This post was last modified on November 14, 2024 11:17 am
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…