మొన్నటిదాకా టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించిన రాశిఖన్నా తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసి రెండు సంవత్సరాలు దాటిపోయింది. నాగ చైతన్య థాంక్ యు, దానికి ముందు గోపీచంద్ పక్కా కమర్షియల్ రెండూ తీవ్రంగా నిరాశపరచడంతో ఇతర బాషల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. హిందీలో హిట్లు పడకపోయినా ఆఫర్లు వస్తున్నాయి. ఎల్లుండి ది సబర్మతి రిపోర్ట్ విడుదల కానుంది. 2002లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన గోద్రా రైలు దుర్ఘటన ఆధారంగా ధీరజ్ సమా దర్శకత్వంలో రూపొందించారు. ట్రైలర్ చూస్తే రాశి ఖన్నాది ప్రాధాన్యం ఉన్న పాత్రగా కనిపిస్తోంది. హిట్టయితే బ్రేక్ దక్కినట్టే.
విక్రాంత్ మాసే హీరోగా నటించిన సబర్మతి రిపోర్ట్ కాంట్రావర్సికి దారి తీస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. రాశిఖన్నా ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో తెలుసు కదాలో నటిస్తోంది. ఇందులో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తోంది. నీరజ కోన దర్శకత్వంలో మంచి రామ్ కామ్ గా రూపొందిస్తున్నారు. ఇది కాకుండా హిందీ, తమిళంలో రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. బాక్ అరణ్మయి 4 కోలీవుడ్ లో తనకు మంచి సక్సెస్ ఇచ్చింది. అంతకు ముందు కార్తీ సర్దార్, ధనుష్ తిరు రెండూ విజయవంతం కావడంతో అక్కడ కెరీర్ బాగానే ఉంది.
ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ రాశిఖన్నాను మిస్ అవుతున్నారు. సబర్మతి రిపోర్ట్ కూడా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతోంది. 2013లో కెరీర్ ని బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ తో మొదలుపెట్టిన రాశిఖన్నా గత ఏడాది యోధా లాంటి భారీ చిత్రంలో నటించినా అది డిజాస్టర్ కావడం చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఒకవేళ తెలుసు కదా కనక బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ ఇక్కడ అవకాశాలు పుంజుకోవచ్చు. రవితేజ, రామ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, నాగచైతన్యలతో మంచి ఫామ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు కొంచెం నెమ్మదించినా సబర్మతి, తెలుసు కదాలు అంచనాలు అందుకుంటే మాత్రం తిరిగి వేగం పెంచొచ్చు.
This post was last modified on November 13, 2024 6:03 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…