భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్ ఇండియా సినిమాల నిర్మాత అంటే ఠక్కున గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన టి సిరీస్ అధినేతగా బాలీవుడ్ లో ఆయనకున్న పట్టు గురించి మూవీ లవర్స్ లో తెలియని వారు ఉండరు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తికి పోటీ వల్ల చుక్కలు కనిపించాయంటే నమ్మడం కష్టమైనా నిజం. ఇటీవలే ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాలు స్వయంగా పంచుకున్నాడు. ఇటీవలే తమ ప్రొడక్షన్లో విడుదలైన భూల్ భులయ్యా 3 వాటిలో ముఖ్యమైంది.
ముందు దీపావళి విడుదల తేదీని తాము ప్రకటిస్తే సింగం అగైన్ చాలా ఆలస్యంగా అదే రిలీజ్ డేట్ నవంబర్ 1 అనౌన్స్ చేశారని, ఇది చాలా అన్యాయమంటూ పలు మార్లు వాళ్లతో సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. కాంపిటీషన్ కమీషన్ ని ఫిర్యాదు చేసినా సమానంగా థియేటర్ల కేటాయింపు జరగలేదని, ఎక్కువ స్క్రీన్లు సింగం అగైన్ కే వెళ్లాయని వివరించారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో భూల్ భులయ్యా 3 ముందంజలో ఉండటం చూసి అప్పుడు పెంచారట. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనే తమ సినిమా మొదటి రోజే 36 కోట్ల గ్రాస్ సాధించడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
సరే ఇదంతా పక్కనపెడితే అంత బడా ప్రొడ్యూసర్ కే పోటీ వల్ల ఇంతటి ఇబ్బంది తలెత్తితే మరి చిన్న మధ్య తరగతి నిర్మాతల వెతలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సరైన థియేటర్లు దొరక్క, డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేక, స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, పంపిణిలో పెద్దలు చూపించే ఆధిపత్యం, ఇలా ఎన్నో కారణాలతో నలిగిపోతున్న ప్రొడ్యూసర్లు లెక్కలేనంత మంది ఉన్నారు. స్పిరిట్, యానిమల్ పార్క్ లాంటి వందల కోట్ల పెట్టుబడితో డీల్ చేస్తున్న భూషణ్ కుమార్ మాటలను బట్టి చూస్తే పోటీ ఎవరికైనా కఠినమైన సవాళ్లను తీసుకొస్తుందని అర్థమయ్యిందిగా.
This post was last modified on November 13, 2024 3:29 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…