పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ ట్రెండ్ ఎప్పట్నుంచో ఉంది. వేరే భాషల చిత్రాలను నెత్తిన పెట్టుకునే మన ప్రేక్షకులు మన సినిమాల్లోని గొప్పదనాన్ని.. మన వాళ్ల ప్రతిభను గుర్తించరు అనే చర్చ జరుగుతుంటుంది.
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. అతడి కొత్త పాట ఏది వచ్చినా.. దాన్ని మనవాళ్లే ఎక్కువ ట్రెండ్ చేస్తుంటారు. అనిరుధ్‌కు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇస్తుంటారు. ‘దేవర’ సినిమా కోసం అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి మరీ అనుకున్నది సాధించిన సంగతి తెలిసిందే. ఐతే అనిరుధ్‌కు ఇంతగా ఎలివేషన్ ఇచ్చే తెలుగు ఫ్యాన్స్.. మన స్టార్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనితనాన్ని గుర్తించలేకపోతున్నారంటూ అతడి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
దేవిలో ఒకప్పటితో పోలిస్తే జోరు తగ్గినా.. అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తూనే ఉంటాడు. తాజాగా అతను సూర్య సినిమా ‘కంగువ’కు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లలో బ్యాగ్రౌైండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తుండగా.. అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. ఇటీవల మన్నింపు అనే పాట రిలీజ్ చేయగా.. ట్యూన్ చాలా ప్రత్యేకంగా అనిపించింది.
తాజాగా వార్ సాంగ్ ఒకటి లాంచ్ చేశారు. అది వేరే లెవెల్ అన్నట్లే ఉంది. కానీ ఈ పాటల గురించి తెలుగు ఫ్యాన్స్ పెద్దగా మాట్లాడట్లేదు. కానీ ఇలాంటి పాటలే అనిరుధ్ కంపోజ్ చేస్తే ఆహా ఓహో అంటూ అతణ్ని కొనియాడేస్తుంటారని.. ‘బాహుబలి’ తరహాలో తమిళంలో భారీగా తెరకెక్కిన ‘కంగువ’ సినిమాకు మన సంగీత దర్శకుడు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తే తనను మాత్రం పట్టించుకోడం లేదని.. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మనవాళ్లకు వంద శాతం కరెక్ట్ అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on November 12, 2024 6:23 pm
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…