Movie News

ఫ్లాపుల దర్శకుడి మీద ధనుష్ నమ్మకం

స్వీయ దర్శకత్వంలో ఇటీవలే రాయన్ తో చెప్పుకోదగ్గ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు ధనుష్. తమిళ వెర్షన్ బాగానే ఆడింది మిగిలిన భాషల్లో ఆ స్థాయి స్పందన తెచ్చుకోకపోయినా ఒక టెక్నీషీయన్ గా మంచి ప్రశంసలే దక్కాయి. వచ్చే ఏడాది నిత్య మీనన్ తో కలిసి ఇడ్లీ కడాయ్ తో పలకరించబోతున్నాడు. ఇదిలా ఉండగా ధనుష్ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కు మరో అవకాశం ఇచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే ఈయన వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. అక్షయ్ కుమార్ తో చేసిన గత చిత్రం రక్షా బంధన్ దారుణంగా బోల్తా కొట్టింది. అంతకు ముందు అత్ రంగీరే సైతం ఓటిటిలో యావరేజ్ ఫలితాన్ని దక్కించుకుంది.

ధనుష్ ఆనంద్ రాయ్ ని ఇంతగా నమ్మడానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్ డెబ్యూ రంఝానా తీసి మంచి హిట్టుతో పాటు గుర్తుండిపోయే తెరంగేట్రం చేయించాడు కాబట్టి ఆ కృతజ్ఞతతోనే అత్ రంగీరేలో అక్షయ్ తో కలిసి నటించాడు. అయినా ఋణం తీరలేదని భావించాడు కాబోలు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ ఇచ్సిన జీరో లాంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని ఆనంద్ చేతులారా వృధా చేసుకున్నారు. కెజిఎఫ్ 1తో తలపడి దారుణమైన ఫలితం చూసిందా మూవీ. తను వెడ్స్ మను లాంటి క్లాసిక్ ఇచ్చిన డైరెక్టర్ ఆ స్థాయి కంటెంట్ మళ్ళీ ఇవ్వకపోయినా నిర్మాతగా హిట్లు కొడుతున్నారు.

ఇప్పుడీ ధనుష్ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. తేరి ఇష్క్ మే టైటిల్ తో రూపొందబోయే ఈ రామ్ కామ్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనుండటం విశేషం. ప్యాన్ ఇండియా భాషలు కాబట్టి తెలుగులోనూ సమాంతరంగా రాబోతోంది. క్రమంగా మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్న ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ యుగానికి ఒక్కడు 2లో కూడా నటించబోతున్నాడు. ప్రకటన ఎప్పుడో ఇచ్చారు బడ్జెట్ కారణాలో ఏమో కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈలోగా ధనుష్ డైరెక్షన్ లోనే నిలవుకు ఎన్మేల్ ఎన్నది కోబమ్ శరవేగంగా పూర్తవుతోంది.

This post was last modified on November 12, 2024 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

1 hour ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago