ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన పుష్ప: ది రూల్ విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. రిలీజ్ దగ్గర పడేకొద్దీ దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. టీం కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఎగ్జైట్మెంట్‌ను పెంచుతోంది.
శ్రీలీలతో కలిసి ఐటెం సాంగ్‌లో బన్నీ స్టెప్పులేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన టీం.. ఈ నెల 17న ట్రైలర్ లాంచ్ చేయనున్న విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రమోషన్ల పరంగా పక్కా ప్లాన్‌తోనే వెళ్తుండగా.. మరోవైపు సుకుమార్ అండ్ టీం చివరి దశ షూటింగ్ చేస్తూనే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులూ కానిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఒక క్రేజీ సమాచారం తెలిసింది. పుష్ప-2 రన్ టైం విషయంలో యూనిట్ నుంచి అందుతున్న సమచారం ఆశ్చర్యపరిచేలాఉంది.
ప్రస్తుతం షూట్ చేసి ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ నిడివి మూడుంబావు గంటల దాకా వచ్చిందట. ఇంకా దానికి రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ కూడా జోడించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే రన్ టైం మూడున్నర గంటల వరకు రావచ్చని సమాచారం. మరి అంత సుదీర్ఘ నిడివితో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. యానిమల్ సినిమా అంత నిడివితోనే రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. అలా అని ప్రతి సినిమానూ అంతేసి నిడివితో రిలీజ్ చేయలేరు.
సుకుమార్ సినిమాలంటే మూడు గంటల నిడివి కామన్ అయిపోయింది. రంగస్థలం, పుష్ప సినిమాలు అంతే నిడివితో మంచి ఫలితాన్నందుకున్నాయి. కాబట్టి సుకుమార్ పుష్ప-2ను కూడా మూడు గంటలకు అటు ఇటుగా రన్ టైంతోనే రిలీజ్ చేసే అవకాశముంది. మొత్తం ఔట్ పుట్ చేతికి వచ్చాక మళ్లీ కత్తెరకు పని చెప్పడం ఖాయం. ఆ దశలో కనీసం 20 నిమిషాల వరకైనా ఎడిట్ చేసే అవకాశాలున్నాయి. ఎలాగైనా సరే మూడు గంటలకు మాత్రం రన్ టైం తగ్గే అవకాశాలు లేవన్నది టీం నుంచి అందుతున్న సమాచారం.
This post was last modified on November 12, 2024 9:45 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…