2025 సంక్రాంతి రిలీజులకు సంబంధించిన డేట్ల వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చినట్టే. థియేటర్ అగ్రిమెంట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా ముందు తేదీలు లాక్ చేసుకుంటే స్క్రీన్ల కేటాయింపుకు అనుకూలంగా ఉంటుంది. జనవరి 10 గేమ్ ఛేంజర్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ముందు వచ్చే అడ్వాంటేజ్ ని రామ్ చరణ్ పూర్తిగా వాడుకోబోతున్నాడు. నిర్మాత దిల్ రాజు కనివిని ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో ఓపెనింగ్స్ వచ్చేందుకు ప్లాన్ వేసుకున్నారు. రెండు రోజుల స్పేస్ దొరుకుంది కనక దేవర, కల్కి 2898 ఏడి లాంటి వాటిని టార్గెట్ చేసుకునే అవకాశముంది.
జనవరి 12 బాలయ్య రావడం దాదాపు పక్కా. డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ రెండింటిలో ఒక పేరుని ఇవాళో రేపో ఫిక్స్ చేసుకుని ప్రకటించేందుకు టీమ్ రెడీగా ఉంది. పోస్టర్లు సిద్ధంగా ఉన్నాయట. జనవరి 14 వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం దిగుతుందట. కొంచెం ఆలస్యమని అభిమానులు ఫీలవుతున్నప్పటికీ గతంలో ఇదే తేదీకి వెంకీ బ్లాక్ బస్టర్స్ కొట్టిన సందర్భాలున్నాయి. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా మొదలు పెట్టలేదు. చివరిగా జనవరి 15 సందీప్ కిషన్ మజాకాని తీసుకొస్తారట. లేట్ అయినా లేటెస్ట్ గా ఉండాలని కాబోలు.
ఇప్పటిదాకా తేలిన లెక్క నాలుగు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ లేదా విదాముయార్చిలలో ఒకటి పొంగల్ కే వస్తుందని చెన్నై వర్గాలు అంటున్నాయి కానీ నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. విక్రమ్ వీర ధీర శూరన్ సైతం ఇదే పండగను టార్గెట్ చేసుకుంటోంది. ఒకవేళ ఓకే అయితే ఎంత టైట్ ఉన్నా తెలుగులో థియేటర్లు దొరకడం అనుమానమే. ఈ ఏడాది స్క్రీన్ల కొరత వల్లే శివ కార్తికేయన్ అయలన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ తమిళంతో సమాంతరంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. కాబట్టి పరిణామాలు ఎలా ఉంటాయో ముందే చెప్పలేం. మొత్తానికి సంక్రాంతి పోటీ మహరంజుగా ఉండబోవడం ఖాయం.
This post was last modified on November 12, 2024 9:49 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…