ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. అలాంటి స్టేచర్ ఉన్న నటుడు ఒక సాహిత్య పరమైన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా ఓ టీవీ ఛానెల్లో నిర్వహించే ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి ప్రభాస్ అతిథిగా వచ్చాడు.
ఇప్పటిదాకా చాలామంది దర్శకులు, లిరిసిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రి గారి సాహిత్యంలో ఉన్న గొప్పదనం గురించి చర్చించారు. కానీ ప్రభాస్ లాంటి టాప్ స్టార్ హీరో ఈ కార్యక్రమానికి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఎపిసోడ్లో సీతారామశాస్త్రి సాహిత్యం తనకెంత ఇష్టమో.. ఆయన పాటల్లో తనకు అత్యంత నచ్చిన పాటలేంటో ప్రభాస్ పంచుకున్నాడు.
శాస్త్రిగారి పాటలన్నింట్లో తనకు ‘జల్సా’ సినిమాలోని ‘ఛలోరే ఛలోరే’ పాట అంటే పిచ్చి అని ప్రభాస్ వెల్లడించాడు. అందులో ఒక్కో లైన్ వింటుంటే మతి పోతుందని ప్రభాస్ చెప్పాడు. ఆ పాటలోని అర్థం గురించి తాను ఎన్నిసార్లు మాట్లాడానో లెక్కే లేదని ప్రభాస్ అన్నాడు. తాను ఎప్పుడూ పార్టీలో పాల్గొన్నా ఆ పాట ప్లే చేయాల్సిందేనని.. చాలాసార్లు తన ఫ్రెండ్స్ వీడు ‘ఛలోరే ఛలోరే’ పాట పెడుతున్నాడ్రోయ్ అంటూ పారిపోయేవారని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు.
ఈ పాటలో వచ్చే ‘రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం’ అనే లైన్ తనకు చాలా చాలా ఇష్టమని ప్రభాస్ చెప్పాడు. ఆయన సినిమా కోసం ఈ లైన్ రాసినా.. అది మన జీవితాల గురించే రాసినట్లు అనిపిస్తుందని ప్రభాస్ అభిప్రాయపడ్డాడు. ‘ఆట’ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నాడు ప్రభాస్.
ఇక ‘మనీ’ సినిమాలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ పాట గురించి మాట్లాడుతూ.. ఇంతకీ తానిప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అంటూ ప్రభాస్ చమత్కరించాడు. ‘చక్రం’ సినిమాలోని జగమంత కుటుంబం పాట.. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యద్భుతమైన పాటల జాబితాలో ఒకటి అని.. తన సినిమా కోసం అలాంటి పాట రాయడం తన అదృష్టం అని.. ఈ పాట స్ఫూర్తితోనే కృష్ణవంశీ ‘చక్రం’ కథ రాశారని.. ఆ పాట సాహిత్యం వెనుక ఉన్న అర్థం తెలిసి తనకు మతి పోయిందని ప్రభాస్ తెలిపాడు.
This post was last modified on November 11, 2024 2:17 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…