తమిళ నటుడు మాధవన్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా ‘సఖి’లోనే అతను మైమరిపించాడు. మణిరత్నం లాంటి దర్శకుడి చిత్రంలో ఆయన స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో నటించి మెప్పించాడు. ఇక అక్కడి నుంచి గత రెండు దశాబ్దాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్నాడు.
హిందీలో సైతం రంగ్‌దె బసంతి, గురు లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. గత కొన్నేళ్లలో విక్రమ్ వేద, ఇరుదు సుట్రు (గురు ఒరిజినల్) లాంటి చిత్రాల్లో మాధవన్ అదరగొట్టాడు. ఐతే ఇంత మంచి నటుణ్ని తెలుగు సినీ పరిశ్రమ మాత్రం సరిగా వాడుకోలేకపోతోంది. అనువాద చిత్రాలతో మాధవన్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని అతణ్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటింపజేద్దామని గతంలోనే ప్రయత్నాలు జరిగాయి.
కానీ తనకు తెలుగు మీద పట్టు లేకపోవడం వల్ల ఇక్కడ నటించలేనని చెప్పేశాడు. కానీ ఈ మధ్య అతడి మనసు మారింది. ‘సవ్యసాచి’లో విలన్ పాత్ర నచ్చి ఆ సినిమా చేయడానికి అంగీకరించాడు. అన్నేళ్ల సెలబ్రేటెడ్ కెరీర్ తర్వాత తెలుగులో మాధవన్ అరంగేట్ర చిత్రం మీద అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా తుస్సుమంది. మాధవన్ పాత్ర కూడా అంచనాలకు తగ్గట్లు లేదందులో.
దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’లో నటించాడు మాధవన్. ఈ క్యారెక్టర్లో ఏదో విశేషం ఉన్నట్లే కనిపించింది. కానీ సినిమాలో ఆ పాత్ర కూడా తేలిపోయింది. ఆ పాత్రకు మాధవన్ మిస్ ఫిట్ అన్నట్లుగా కనిపించాడు. మాధవన్‌ను అలాంటి పాత్రలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఆ పాత్రను కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇటు తమిళంలో, అటు హిందీలో అదిరిపోయే రోల్స్ చేసిన మాధవన్‌ను తెలుగు దర్శకులు సరిగా ఉపయోగించుకోలేక వేస్ట్ చేసేయడం విచారించాల్సిన విషయం. వరుసగా రెండు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న మాధవన్.. ఇంకోసారి తెలుగులో నటిస్తాడా అన్నది సందేహమే.
This post was last modified on October 12, 2020 9:44 am
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…