పుష్ప 2 స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పరుగులు పెట్టుకుంటూ జరుగుతోంది. అల్లు అర్జున్, శ్రీలీల మీద ప్రత్యేకంగా వేసిన సెట్లో తీసిన పాట తాలూకు ఫోటో లీక్ రెండు రోజుల క్రితమే బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న అఫీషియల్ గా టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే పుష్ప 1లో సమంతా ఊ అంటావా ఊహు అంటావాని మరిపించేలా ఈ ప్రత్యేక గీతం ఉంటుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో రావడం సహజం. అయితే చిత్రీకరణలో లైవ్ గా ఉంటున్న వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం సామ్ డాన్సుకి రెండు మూడింతలు ఎక్కువే శ్రీలీల చేస్తోందని సమాచారం.
అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో దర్శకుడు సుకుమార్ కు బాగా తెలుసు కాబట్టే దానికి అనుగుణంగానే డిజైన్ చేయించారట. కిసిక్ అనే ఊతపదంతో దేవిశ్రీ ప్రసాద్ మంచి మాస్ ట్యూన్ కంపోజ్ చేశారని తెలిసింది. ట్రైలర్ తర్వాత దీన్నే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మైత్రి మేకర్స్. విడుదలకు ఇంకో 25 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు. గుమ్మడికాయ ఈ వారంలోనే కొట్టేసి ప్యాన్ ఇండియా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఏడు ప్రధాన నగరాలతో పాటు వీలైనన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు, నేషనల్ మీడియా కవరేజ్ వచ్చేలా మొత్తం సెట్ చేసి పెట్టారు.
వెయ్యి కోట్ల బిజినెస్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 ది రూల్ కు అందులో సగంపైగా మొదటి వారంలోనే వచ్చే అంచనాలు ట్రేడ్ లో బలంగా ఉన్నాయి. హైప్ కూడా దానికి తగ్గట్టే ఉంది. డిసెంబర్ 5 జరగబోయే అరాచకం మాములుగా ఉండేలా లేదు. తమన్ రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టేశాడు. కొంత భాగం అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ కంపోజ్ చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది. పుష్ప 2 దెబ్బకే పోటీగా రావాలనుకున్న బాలీవుడ్ చావా ఏకంగా నెలకు పైగానే వాయిదా వేసుకుంది. ఇతర భాషల్లోనూ ఎవరూ బన్నీతో కాంపిటీషన్ చేసే రిస్కుకు సిద్ధంగా లేరు.
This post was last modified on November 11, 2024 2:17 pm
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…