ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న కంగువకు ఘనస్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తీసుకుని సూర్య విపరీతంగా కష్టపడిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కోలీవుడ్ కు బాహుబలి రేంజ్ మైలురాయిగా నిలిచిపోతుందని తమిళనాడులో భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు వెర్షన్ సైతం భారీ రేట్లు పలుకుతోంది. తెల్లవారుఝాము నాలుగు గంటలకు ప్రీమియర్ షోలకు సిద్ధ పడ్డారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్, కల్కి స్థాయి వైబ్ లేదనే కామెంట్స్ నేపథ్యంలో నిన్న వదిలిన కొత్త థియేట్రికల్ ట్రైలర్ హైప్ ని అమాంతం పెంచేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండో వారంలో ఉన్న అమరన్ వల్ల కంగువకు ఖంగారు తప్పడం లేదని ట్రేడ్ టాక్. ఎందుకంటే ఇప్పటికే రెండు వందల కోట్లు దాటిన గ్రాస్ తో అద్భుతంగా రన్నవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు. హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ డిస్ట్రిబ్యూటర్లు థర్డ్ వీక్ కూడా అధిక శాతం స్క్రీన్లలో దీన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంగువకు యునానిమస్ గా ఎక్కువ స్క్రీన్లు దక్కకపోవచ్చనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అదే జరిగితే కనక ఆల్ టైం రికార్డుల కోసం చూస్తున్న వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం తగ్గిపోతుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలే డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్నాయట. తెలుగులో సమస్య లేదు. ఇక్కడ రన్ కొంచెం నెమ్మదించింది. రెండో వీకెండ్ తిరిగి దూకుడు చూపించినప్పటికీ ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడీ అమరన్ సమస్య వల్లే తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వీలైనంత పెద్ద ఎత్తున స్క్రీన్ కౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అయితే అమరన్ పంపిణీదారులు నుంచే స్పీడ్ బ్రేకర్ ఎదురవుతోందని వినికిడి. సో కంగువకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్ప దీనికి పరిష్కారం ఉండదు.
This post was last modified on November 11, 2024 10:13 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…