నిన్న మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ఇచ్చిన స్పీచ్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఎవరైతే తమ ఎదుగుదలకు కారణమైన వాళ్ళను మర్చిపోతారో అప్పుడు ఎంత సక్సెస్ సాధించినా వృథా అనే తరహాలో మెగా ప్రిన్స్ అన్న మాటలు ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేస్తున్నాయనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. నంద్యాల పర్యటన తర్వాత అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఏకంగా ఆన్ లైన్ వార్స్ కి దారి తీసి పుష్ప 2, గేమ్ ఛేంజర్ గురించి పరస్పరం బురద జల్లుకునే దాకా వెళ్ళింది. ఇలాంటి వేడి రాజుకున్న టైంలో వరుణ్ ప్రసంగం ఆజ్యం పోసింది.
నిజానికి తన మనసులో ఏ ఉద్దేశం ఉందో కానీ అర్థం మాత్రం వేరే కోణంలో వెళ్ళిపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుచుకునే క్రమంలో వరుణ్ చాలా విషయాలే చెప్పాడు. టెన్షన్ లో ఉన్నప్పుడు తెల్లవారుఝామునే చరణ్ ఫోన్ చేయడం, వరస ఫ్లాపుల్లో ఉన్న తనకు కుటుంబం అందించిన మద్దతు ఇలా చాలా చెప్పుకొచ్చాడు. ఎంతసేపూ మీ వాళ్ళ గురించే మాట్లాడతావా అనే ప్రశ్న బయట తనకు ఎదురయ్యిందని అందుకే ఇదంతా చెప్పానని వరుణ్ స్పీచ్ మొదట్లోనే అన్నాడు. కాని దాని కన్నా ఎక్కువ సక్సెస్ గురించి చేసిన కామెంట్లే వైరలయ్యాయి.
సున్నితత్వం విపరీతంగా పెరిగిపోయిన వాతావరణంలో ప్రతిదీ శల్యపరీక్షకు గురవుతోంది. వరుణ్ కి నేరుగా బన్నీని టార్గెట్ చేసే ఆలోచన లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చరణ్ లాగా తను గ్లోబల్ స్టార్ కాదు. ఆ మాటకొస్తే వరస డిజాస్టర్లతో డిఫెన్స్ లో ఉన్నాడు. మట్కా బ్లాక్ బస్టర్ అయితేనే మార్కెట్ నిలబడుతుంది. లేదంటే ఇంకా రిస్క్ లో పడుతుంది. ఇలాంటి టైంలో లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోడనేది కొందరు ఫాన్స్ చేస్తున్న అనాలసిస్. ఊరికే భూతద్దంలో చూస్తున్నారు తప్పించి వరుణ్ కేవలం తన ఫ్యామిలీ గురించి మాత్రమే హైలైట్ చేయబోతే ఇంకోలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on November 11, 2024 10:09 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…