2020 సంవత్సరాన్ని ప్రపంచ సినీ పరిశ్రమ అంత సులువుగా మరిచిపోదు. కరోనా ధాటికి అన్ని రంగాలూ దెబ్బ తిన్నాయి కానీ.. సినీ పరిశ్రమకు తగిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. వరల్డ్ వైడ్ సినీ రంగానికి ఎంత నష్టం వాటిల్లి ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. ఆరు నెలలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సినిమాల విడుదల ఆగిపోయింది.
కొన్ని దేశాల్లో ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేసినా ఆశించిన రెవెన్యూ లేదు. క్రిస్టోఫర్ నోలన్ లాంటి మేటి దర్శకుడు తన ‘టెనెట్’ చిత్రాన్ని ధైర్యం చేసి విడుదల చేస్తే దానికి బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. మంచి రివ్యూలు వచ్చినా సరే.. చాలా దేశాల్లో సినిమా విడుదల కాకపోవడం, రిలీజ్ చేసిన చోట జనాలు థియేటర్లకు ఆశించిన స్థాయి రాకపోవడంతో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు.
మామూలుగా అయితే ఈ చిత్రానికి 500 మిలియన్ డాలర్లకు తక్కవగా వసూళ్లు వచ్చేవి కావు. కానీ ఇప్పటిదాకా ఈ చిత్రం అందులో సగం వసూళ్లు సాధించలేదు. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా అందుకోలేదు.
‘టెనెట్’ రిలీజ్ కావడానికి ముందు వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం మరో భారీ చిత్రం ఎదురు చూస్తూ ఉంది. అదే.. జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’. ఏప్రిల్లోనే రావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా వల్లే వాయిదా వేశారు. నవంబరులో రిలీజ్ చేద్దామనుకున్నారు. కరోనా భయం కొనసాగుతున్నప్పటికీ నవంబరులోనే రిలీజ్ అని నెల కిందట చిత్ర బృందం ధీమాగా చెప్పింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆత్మవిశ్వాసం తగ్గినట్లుంది. ‘టెనెట్’ తరహాలో ఎదురు దెబ్బ తినడం ఎందుకని ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా వాయిదా వేసేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్లో ‘నో టైం టు డై’ని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. అప్పటికి పరిస్థితులు బాగుపడతాయని ఆశిస్తున్నారు. 2006లో ‘క్యాసినో రాయల్’తో బాండ్ అవతారం ఎత్తి.. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్టర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించిన డేనియల్ క్రెయిగ్‌కు బాండ్ పాత్రలో ‘నో టైం టు డై’నే చివరి సినిమాగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరీ జోజి రూపొందించాడు.
This post was last modified on October 3, 2020 5:08 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…