దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన చిత్రం.. అమరన్. తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదులపెట్టి మిడ్ రేంజ్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. సాయిపల్లవి అతడికి జంటగా నటించింది. ఇది కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా ప్రోమోలు బాగానే అనిపించినా.. ఆర్మీ మ్యాన్ బయోపిక్స్ ఇండియన్ సినిమాలో కొత్త కాదు. ‘మేజర్’ రూపంలో ఈ జానర్లో రెండేళ్ల కిందట తెలుగులో మంచి సినిమా చూసిన నేపథ్యంలో మళ్లీ ఇలాంటి సినిమా ఇంకోటి ఏం చూస్తారులే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా తమిళంలో శివకార్తికేయన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ బాగా ఆడుతుందేమో కానీ.. దీపావళికి తెలుగులో గట్టి పోటీ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాకు ఏమాత్రం కలెక్షన్లు వస్తాయిలే అనుకున్నారు చాలామంది.
కానీ ‘అమరన్’ తమిళంలోనే కాక తెలుగులోనూ సంచలన విజయమే సాధించింది. తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టిన ‘లక్కీ భాస్కర్’, ‘క’ చిత్రాలకు ‘అమరన్’ దీటుగా నిలిచింది. వాటితో సమానంగా కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ‘అమరన్’ తెలుగు వసూళ్లు పాతిక కోట్ల గ్రాస్ మార్కును దాటేశాయి. షేర్ రూ.15 కోట్లకు పైగానే వచ్చింది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి లాభాల పంట పండినట్లే. ఇక వరల్డ్ వైడ్ ‘అమరన్’ అన్ని వెర్షన్లూ కలిపి రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం విశేషం. శివకార్తికేయన్ మార్కెట్ రేంజికి, ఈ సినిమా జానర్‌కు ఉన్న పరిమితుల ప్రకారం చూస్తే 200 కోట్ల వసూళ్లు చాలా పెద్ద ఘనతే. ఈ విజయంలో హీరోయిన్ సాయిపల్లవికి కూడా ముఖ్య పాత్ర ఇవ్వాల్సిందే. తెలుగులో ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూడ్డానికి ఆమే ముఖ్య కారణం. రెండో వీకెండ్లో ఈ సినిమా కొత్త సినిమాలాగా మంచి వసూళ్లతో సాగుతోంది. శనివారం తెలుగులో మెజారిటీ షోలు మంచి ఆక్యుపెన్సీలతో నడిచాయి. ‘కంగువ’, ‘మట్కా’ వచ్చే వరకు ‘అమరన్’ జోరు కొనసాగనుంది.
This post was last modified on November 10, 2024 11:55 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…