పవన్ కళ్యాణ్‌ను ఇప్పుడు సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు జనం. సినిమాలకు ఆయన ఎప్పుడో ప్రాధాన్యం తగ్గించేశారు. కానీ ఆల్రెడీ కమిటైన సినిమాలను పూర్తి చేయక తప్పని పరిస్థితుల్లో కొంచెం వీలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు వివిధ దశల్లో ఆగిపోగా.. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడానికి పవన్ చూస్తున్నారు.
ఐతే వీటితో పాటు పవన్ కమిటైన మరో సినిమా కూడా ఉంది. వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించాల్సిన సినిమా అది. నాలుగేళ్ల కిందటే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తర్వాత కొన్నాళ్లు ఆ సినిమా చర్చల్లో ఉంది. కానీ మూడేళ్ల నుంచి ఈ సినిమా గురించి ఏ ఊసూ లేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక అయినా పవన్ ఈ సినిమాను టేకప్ చేస్తాడేమో అని అభిమానులు భావిస్తున్నారు.
కానీ పవన్‌కు వ్యక్తిగతంగానూ మంచి మిత్రుడైన రామ్ తాళ్లూరి.. తాము అనుకున్న సినిమాను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు లేవని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేశారు. పవన్‌తో చేయాల్సిన సినిమాకు ఐదేళ్ల ముందు అడ్వాన్స్ ఇచ్చామని.. సురేందర్-వంశీ కలిసి మంచి కథ తయారు చేశారని.. ఆ కథ పవన్‌కు కూడా చాలా నచ్చిందని రామ్ వెల్లడించారు.
ఈ కలయికలో ‘కిక్’ మూవీ రావాల్సిందని.. ఆ సినిమా మిస్ అయినప్పటికీ, ఆ కథ చాలా బాగుందని, దాన్ని మార్చకుండా అలాగే చేద్దామని సురేందర్-వంశీలకు పవన్ చెప్పాడని రామ్ తెలిపారు. కానీ పవన్‌కు ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదని.. పవన్ ఈ కథను ఓకే చేసిన సమయంలోనే సురేందర్ రెడ్డి అఖిల్ సినిమా మీదికి వెళ్లాడని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం వల్ల తనకు ఈ సినిమా మీద ఆశలు లేవని రామ్ తెలిపారు.
తన చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేయడానికే పవన్‌కు చాలా సమయం పట్టేలా ఉండడం, వాటి తర్వాత కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఈ చిత్రంపై రామ్ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. సురేందర్ దర్శకత్వంలోనే వేరే హీరోతో మరో కథ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రామ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘మట్కా’ ఈ నెల 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on %s = human-readable time difference 6:57 pm
ప్రముఖ కోలీవుడ్ నటుడు ఢిల్లీ గణేష్ నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనారోగ్యం కారణంగా కన్ను మూయడం…
ప్రభాస్ స్థాయి ప్యాన్ ఇండియాని మించి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. నిన్న సాయంత్రం కొరియన్ నటుడు డాన్…
దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన చిత్రం.. అమరన్. తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదులపెట్టి మిడ్ రేంజ్ హీరోగా ఎదిగిన…
తాజాగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. తొలి దశలో 21 పదవులను కేటాయించిన సీఎం చంద్రబా బు.. మలి…
ఆయన వైసీపీ ఫైర్‌బ్రాండ్. చంద్రగిరి నుంచి వరుస విజయాలు కూడా అందుకున్నారు. వైసీపీ అధినేత జగన్ అన్నా.. వైఎస్ కుటుంబం…
ఏపీలో సర్కారు మారింది. ప్రభుత్వ విధానాలతోపాటు.. ఆలోచనలు కూడా మారాయి. సంపద సృష్టి.. ఆదాయ వనరుల పెంపు దిశగా సీఎం…