ఎంత సెలబ్రెటీలు అయినా సరే.. వాళ్లకూ నచ్చిన హీరోయిన్లు ఉంటారు యుక్త వయసులో వాళ్లకు క్రష్‌లు ఉంటారు. హీరో అయ్యాక అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన సూర్యకు కూడా ఒక సెలబ్రెటీ క్రష్ ఉన్న ఇప్పుడు వెల్లడైంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే ‘అన్‌స్టాపబుల్’ షోలో ఈ విషయం వెల్లడైంది.
ఈ షో ప్రోమోలోనే బాలయ్య.. సూర్యను క్రష్ గురించి అడగ్గా అతను సిగ్గుపడుతూ తాను ఇంటికి వెళ్లాలి సార్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎపిసోడ్లో అయినా ఈ విషయం బయటికి వస్తుందా అని సూర్య ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూశారు. మొత్తానికి ఎపిసోడ్లో ఈ విషయం కార్తి ద్వారా బయటికి వచ్చింది. తన అన్న క్రష్ ఎవరో కార్తి ఫోన్ కాల్ ద్వారా వెల్లడించడం విశేషం.
సూర్యకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టమని వెల్లడించిన కార్తి.. తన అన్న వద్దు వద్దు అంటున్నా, బాలయ్య విజ్ఞప్తి మేరకు ఆ హీరోయిన్ ఎవరో చెప్పేశారు. సీనియర్ హీరోయిన్ గౌతమి అంటే సూర్య యుక్త వయసులో పడి చచ్చేవాడట. ‘జెంటిల్ మ్యాన్’ సినిమాలోని చికుబుకు రైలే పాటలో గౌతమిని చూసి సూర్య ఫ్లాట్ అయిపోయాడని కార్తి వెల్లడించాడు. ఈ విషయం వెల్లడించినపుడు కార్తిని నువ్వు కార్తి కాదురా, కత్తి అని సూర్య వ్యాఖ్యానించడం విశేషం. 80, 90 దశకాల్లో గౌతమి సౌత్ ఇండియాలో టాప్ మీరోయిన్లలో ఒకరు. ఆమె అందాని ఎంతోమంది ఫిదా అయిపోయారు. అందులో సూర్య కూడా ఒకడని ఇప్పుడు వెల్లడైంది.
ఇదిలా ఉండగా తాను, కార్తి చాలా అల్లరి చేసేవాళ్లమని, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్లమని.. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన కార్తి చదువు కోసం యుఎస్ వెళ్లినపుడు మాత్రం చాలా బాధ పడ్డానని.. ఈ మూడేళ్లలోనే తమ మధ్య బంధం బలపడిందని సూర్య తెలిపాడు. యుఎస్ వెళ్లి చదువుకుని అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా చేసిన కార్తి.. తన అన్న హీరోగా స్థిరపడ్డాక తిరిగి వచ్చి ‘పరుత్తి వీరన్’ మూవీతో నటుడిగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంలోనే అద్భుత అభినయం ప్రదర్శించి, ఘనవిజయాన్నందుకున్న అతను.. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
This post was last modified on November 9, 2024 6:36 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…